కూటమిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఈసారి టిడిపి జనసేన బిజెపి పార్టీలు భారీ స్థాయిలో సీట్లను సాధించాయి. కేవలం వైసీపీ పార్టీకి 11 స్థానాలకే పరిమితం చేశాయి.. అలాగే కడప ఎమ్మెల్యేగా మాధవి రెడ్డి టిడిపి పార్టీ నుంచి గెలిచింది. అప్పటినుంచి ఈమె పేరు బాగానే వినిపిస్తూ ఉన్నది.. తాజాగా ఇప్పుడు కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి పోలీసుల పైన ఫైర్ అయినట్లుగా తెలుస్తోంది. వాటి గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.


కడప జిల్లాలో ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించిన ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి రెడ్డి గన్మెన్లను సైతం ఇటీవలే తాజాగా తొలగించారట. ఈ విషయం రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారుతోంది.మాధవి రెడ్డి భర్త తెలుగుదేశం పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డికి నిన్నటి వరకు ఉన్నటువంటి వన్ ప్లస్ గన్మెన్లను సైతం తొలగించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని కడప పోలీసులు ఎవరికి చెప్పకుండా వెనక్కి రావాలని పిలిపించాలట.. అలాగే కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డికి ఉన్న 2 ప్లస్ 2 గన్మెన్లను సైతం వన్ ప్లస్ గా కుదించారని వారిని వెనక్కి రావాలంటు పిలిపించారట.


అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా తన సెక్యూరిటీని ఇలా కుదించడం పైన ఆమె పోలీసుల తీరు పైన ఫైర్ అయినట్లు తెలుస్తోంది ఎమ్మెల్యే మాధవి రెడ్డి. తనతో ఒక్క మాట చెప్పకుండా ఇలాంటి పని చేస్తారా అంటూ ఆమె మనస్థాపం చెందారు.. తనకు ఎలాంటి భయం లేదని తనకు ఇచ్చిన వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ కూడా అవసరం లేదంటూ ఆమె ప్రస్తుతం ఉన్న వారిని కూడా వెనక్కి పంపించేసిందట.మరొక వైపు అసెంబ్లీ సమావేశాలకు సైతం సెక్యూరిటీ లేకుండా హాజరయ్యారు ఎమ్మెల్యే మాధవి రెడ్డి.. గతంలో వైసిపి అభ్యర్థి తమ్ముడి నుంచి తనకు త్రెడ్ ఎక్కువగా ఉందంటూ కడప జిల్లా ఎస్పీ కి కూడా ఫిర్యాదు చేసింది మాధవి రెడ్డి. అప్పట్లో ఆమెకు అందుకే గన్మెన్లను కూడా కేటాయించారు కానీ ఇప్పుడు ఇలా చేయడం అందరికీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: