తెలంగాణ రాష్ట్రంలో... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన అబద్ధాలన్నీ బట్టబయలు అయ్యాయి. ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ విష ప్రచారం చేయడంతో.. అసలు కాలేశ్వరం ప్రాజెక్టు వృధా అని భావనలోకి తెలంగాణ ప్రజలు వచ్చారు. కానీ మొన్న ఎండాకాలంలో.. నీటి సమస్యతో కాలేశ్వరం ప్రాజెక్టు విలువ అందరికీ తెలిసింది. రెండు పిల్లర్లు కుంగడంతో.. కెసిఆర్ పై విషప్రచారం చేసింది రేవంత్ రెడ్డి గ్యాంగ్.

 

లక్ష కోట్లు  కల్వకుంట్ల కుటుంబం తినేసిందని... తప్పుడు ప్రచారం చేసింది కాంగ్రెస్.భారీ వరదలు వస్తే మేడిగడ్డతో పాటు కాలేశ్వరం ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోతుందని... ఎన్నికల కంటే ముందు.. నాన హంగామా చేసింది. దాని ఫలితంగా గులాబీ పార్టీ రెండు శాతం ఓట్ల తేడాతో ఓటమిని చవి చూడడమే కాకుండా పదేళ్ల ప్రభుత్వాన్ని పోగొట్టుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ పాలనాలో తెలంగాణ పరిస్థితి అత్యంత దారుణంగా తయారయిందని చెప్పవచ్చు.

 

అన్ని రంగాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని విమర్శలు వస్తున్నాయి. అయితే.. ప్రస్తుతం మహారాష్ట్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాలు నేపథ్యంలో...  గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది.  రెండు గట్లు పట్టుకొని గోదావరి నది.. వెళ్తోంది. కొన్ని లక్షల క్యూసెక్కుల... వందల టిఎంసిల నీళ్లు.. మేడిగడ్డ ద్వారా ప్రవహిస్తున్నాయి. కానీ మేడిగడ్డ పిల్లర్లకు గాని... కాలేశ్వరం ప్రాజెక్టుకు గాని ఎలాంటి ఇబ్బంది లేకుండా.. సవ్యంగా ఉంది.

 

ఎంతో ధైర్యం చేసి కల్వకుంట్ల చంద్ర శేఖర రావు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. దాని వల్ల ఏపీ కి అన్యాయం జరిగిన కూడా తెలంగాణకు మాత్రం.. 100 కు 200% మేలు జరిగింది. రైతులు మూడు పంటలు  వేసే పరిస్థితికి కాలేశ్వరం తీసుకువచ్చింది. కానీ అలాంటి ప్రాజెక్టు పైన కాంగ్రెస్ దుష్ప్రచారం చేసి కేసీఆర్ ప్రభుత్వాన్ని పడ గొట్టింది.  కానీ ఇప్పుడు అసలు విషయానికి తెలుసుకున్న తెలంగాణ ప్రజలు... నోరేళ్ళ బెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: