కేంద్రంలో ముచ్చటగా 3వసారి ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం 2024-25 ఆర్ధిక సంవత్సరానికి గాను తొలి బడ్జెట్ ని తాజాగా విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలోనే బడ్జెట్ గురించి కొన్ని రకాల విశ్లేషణలు మనకి వినబడుతున్నాయి. బడ్జెట్ ప్రవేశ పెట్టింది దేశ హితానికా లేక రాజకీయమా? అనే అంశం మీద ఇపుడు ఎవరి విశ్లేషణలు వారు చేస్తున్నారు. ఈ బడ్జెట్ పట్ల nda కూటమి సంతృప్తిగా ఉంటే ఇండియా కూటమి మాత్రం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టు కనబడుతోంది. ఈ క్రమంలోనే మోడీ బడ్జెట్ ప్రవేశపెట్టాడా? బిజినెస్ ప్రవేశపెట్టాడా? అర్ధం కావడంలేదని మరికొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు.

యావత్ దేశంలో గుజరాతీయులు అనగానే బిజినెస్ మైండ్ ఎక్కువగా ఉంటుందని అందరూ అంటూ ఉంటారు. అది అన్ని వేళలలో అన్ని విషయాల్లో వర్తిస్తుంది అంటే.. అది చెప్పడం కష్టమే. మరి మోడీ తాజా బడ్జెట్ లో ఆ మార్క్ కనిపించిందా? అంటే... అవుననే అంటున్నారు ఎకనమిస్టులు. ఈ బడ్జెట్లో ప్రజలతో బిజినెస్ టాక్టీస్ చేసినట్లుగా ఉంది అంటూ పలువురు ఆరోపణలు చేస్తున్నారు. ఇదంతా ఒకెత్తయితే బీహార్ రాష్ట్రానికి ఎంత మేరకు బడ్జెట్లో నిధుల కేటాయింపు చూపించారో తెలియదు కానీ ఇండియా కూటమి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు మాత్రం మొత్తంగా బోడిగుండు కొట్టినట్టు అయింది అని ఆరోపిస్తున్నారు సో కాల్డ్ నాయకులు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలతో రాజకీయ అవసరాలు లేవని అలా చేశారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలాంటపుడు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం దేనికి అనే మాటలు బలంగా వినబడుతున్నాయి.

ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతీ పౌరుడూ పన్ను రూపంలో కట్టిన ప్రతి రూపాయి కేంద్రానికి వెళ్తుంది. మళ్లీ ఆ రూపాయిలో ఎంతో కొంత ఆయా రాష్ట్రానికి పెద్దన్నగా ఇవ్వాల్సిన ధర్మం అయితే కేంద్రానికి ఉంటుంది. అలాంటపుడు తమకి నచ్చిన రాష్ట్రాలకు నిధులు కేటాయించి, మిగిలిన రాష్ట్రాలకు మొండి చేయి చూపడం ఎంతవరకు కరెక్ట్ అని వాదిస్తున్నారు మేధావులు. కానీ పాలకులు అలా చేయడం లేదు. తమకు లాభం ఉంటే విదిలిస్తున్నారు... లేదంటే లేదు.. అనే ఆరోపణలు వస్తున్నాయి. కాగా గత పదేళ్లుగా ఏపీ వైపు చూడని కేంద్ర బడ్జెట్ ఇపుడు కేంద్రంలో ప్రభుత్వం కాపాడుకోవడానికి టీడీపీ కోసం ఎంతో కొంత చేసినట్లుగా చూపిస్తున్నారు అని కొంతమంది ఎద్దేవా చేస్తున్నారు. బీహార్ లో సైతం నితీష్ కుమార్ జేడీయూ ఉంది. దాంతో అక్కడ మిత్ర పక్షాన్ని సంతృప్తి పరచడం కోసం ఇలా చేస్తున్నారు అని ఆరోపణలు వస్తున్నాయి. మరి దీనిపైన మీ స్పందన ఏమిటి?

మరింత సమాచారం తెలుసుకోండి: