ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు కానున్న పథకాలలో ఎక్కువ మంది ఎదురుచూస్తున్న పథకం ఏదనే ప్రశ్నకు తల్లికి వందనం స్కీమ్ పేరు సమాధానంగా వినిపిస్తోంది. తల్లికి వందనం స్కీమ్ వల్ల తల్లీదండ్రులు ఎక్కువ మొత్తం ఖర్చు చేయకుండానే తమ పిల్లలను ప్రైవేట్ స్కూల్స్ లో చదివించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఈ స్కీమ్ అమలుకు సంబంధించి ఈ మధ్య కాలంలో ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
 
ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమంది పిల్లలకు తల్లికి వందనం ఇస్తామని లోకేశ్ వెల్లడించారు. ఆ హామీకి కట్టుబడి ఉన్నామని లోకేశ్ పేర్కొన్నారు. ఈ స్కీమ్ కు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించడానికి కొంత సమయం కావాలని లోకేశ్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో నారా లోకేశ్ మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అయ్యాయి.
 
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సైతం తల్లికి వందనం స్కీమ్ ను అమలు చేస్తామని నారా లోకేశ్ పేర్కొన్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం స్కీమ్ అమలు చేస్తామని చెప్పడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. తల్లికి వందనం స్కీమ్ అమలు కొరకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
 
ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండగా వైరల్ అవుతున్న వార్తలలో ఏ మాత్రం నిజం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్కీమ్ అమలు జరగాలంటే తల్లులు, పిల్లలు ఆధార్ కార్డ్ అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి క్యాంప్ లు సైతం నిర్వహిస్తున్నారని సమాచారం అందుతోంది. తల్లికి వందనం స్కీమ్ అమలు తేదీకి సంబంధించి త్వరలో పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు. ఈ స్కీమ్ వల్ల కోటి కంటే ఎక్కువ మంది పిల్లలకు బెనిఫిట్ కలగనుంది.






మరింత సమాచారం తెలుసుకోండి: