ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ,బీజేపీ ,జనసేన కూటమి భారీ విజయం సాధించింది.ఏకంగా 164 అసెంబ్లీ సీట్లు సాధించి రికార్డు క్రియేట్ చేసింది.అయితే గత ఎన్నికలలో 151 సీట్లు సాధించి సంచలనం సృశించిన వైసీపీ పార్టీ ఈ సారి కేవలం 11 సీట్లు మాత్రమే సాధించి ప్రతిపక్ష హోదా కోల్పోయారు.అయితే గత ఎన్నికలలో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయినా జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ సారి ఎన్నికలలో పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ సీట్లు ,2 పార్లమెంట్ సీట్లు పొంది అన్నిటిలోను ఘనవిజయం సాధించి 100 శాతం స్ట్రైక్ రేట్ పొందారు.పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజక వర్గం నుంచి పోటీ చేసి తిరుగులేని మెజారిటీతో గెలుపొందారు.అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా భాద్యతలు చేపట్టారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి భాద్యతలు స్వీకరించిన చంద్రబాబు పలు కీలక సంస్కరణలు చేసారు.ఎన్నికల ప్రచారంలో ఉపాధ్యాయ నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సి ప్రకటించి ఇచ్చిన మాట నిలపెట్టుకున్న చంద్రబాబు త్వరలోనే తాను హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పధకాలను అమలు చేయనున్నారు.ఇదిలా ఉంటే జులై 22 నుంచి రాష్ట్రంలో ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.ఈ సమావేశాలకు హాజరైన వైసీపీ మధ్యలోనే వాకౌట్ చేసి అసెంబ్లీ ముందు నిరసన చేపట్టారు.తనకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ స్పీకర్ కు లేఖ రాసిన స్పందించకపోవడంతో జగన్ హైకోర్టు లో పిటీషన్ వేశారు.రాష్ట్రంలో ఏ పార్టీ అయిన ప్రతిపక్ష హోదా పొందాలంటే కనీసం 10 శాతం సీట్లు సాదించాలి .అయితే వైసీపీ కి కేవలం 11 సీట్లే రావడంతో ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని స్పీకర్ తెలిపారు.అయితే గతంలో అసెంబ్లీ సీట్లతో సంబంధం లేకుండా పలువురు నాయకులు ప్రతిపక్ష హోదా పొందారని జగన్ గుర్తు చేస్తూ వస్తున్నారు.దీనితో జగన్ కు ప్రతిపక్ష హోదా లభిస్తుందో లేదో అని వైసీపీ నేతలు కన్ఫ్యూషన్ లో పడ్డారు
.

మరింత సమాచారం తెలుసుకోండి: