తాజాగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీ వేదికగా నిరసన గళం వినిపించారు. చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి, భద్రతలను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందంటూ పోరు బాట పడ్డారు. ఈ క్రమంలోనే జంతర్ మంతర్‌ వేదికగా వైఎస్ జగన్, & కో ధర్నా చేపట్టడం జరిగింది. ఇక్కడ జగన్‌తో పాటు పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర కీలక నేతలంతా ధర్నాలో పాల్గొనడం జరిగింది. ఏపీలో ఈ మధ్య జరిగిన ఘటనలపై ఫొటో, వీడియో ఎగ్జిబిషన్‌ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏపీలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తు సంస్థలతో విచారణ జరపాలని జగన్ డిమాండ్ చేయడం జరిగింది.

తాజా ధర్నాతో ఏపీలో జరుగుతున్న దాడులు, హింసాత్మక ఘటనలను దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం అని అన్నారు. ఈ క్రమంలో అయన దగ్గరున్న చిట్టా విప్పారు.. గడిచిన 50 రోజుల్లో 36 మందిని ప్రస్తుత ప్రభుత్వం హత్య చేసిందని మండిపడ్డారు. పూర్తిగా ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారని, అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా? అంటూ వాపోయారు. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. అందుకే ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్‌ చేశారు జగన్.

అక్కడితో ఆగకుండా ఈ విషయమై పలు జాతీయ పార్టీల నేతల్ని కూడా కలిసి రాష్ట్రంలో పరిస్థితిని వివరించి.. మద్దతు కోరుతున్నట్టు తెలుస్తోంది. అక్కడికి తరలి వెళ్లిన పలు మీడియాలు వేదికగా ఆయన మాట్లాడుతూ... ఈ అరాచక పాలనను అంతమొందించేదాకా దీక్షను విరమించేది లేదని, కేంద్రం ఈ విషయంలో చూసీ చూడక వ్యవహరించడం సబబు కాదని అన్నారు. స్వయంగా మోడీ వచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: