తెలంగాణలో వరుస పెట్టి బీఆర్ఎస్ పార్టీకి షాకులు మీద షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ... ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరిపోతున్నారు. ఇప్పటికే పదిమంది ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరిపోయిన సంగతి తెలిసిందే. వలసలను ఆపేందుకు కేసిఆర్ ... కేటీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న ఎవరు ఆగటం లేదు. పార్టీలో జరుగుతున్న పరిణామాలతో కేసీఆర్ తీవ్ర అసహనంతో రగిలిపోతున్నారు. తాజాగా ఇప్పుడు మరో ఎమ్మెల్యే ... ఎమ్మెల్సీ పార్టీ మారెందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్ న‌గర్లో కారు పార్టీ ఖాళీ కానుంది.


ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలలో ఇప్పటికే ఒకరు కండువా మార్చేశారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పుడు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు వంతు వచ్చింది. మా సారు ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి ఎంత చెపితే అంత అని విజయుడు అంటున్నారు. ఇద్దరు జాయింట్ గా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకునే ప్లాన్లో ఉన్నారట. ఇప్పటికే ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చర్చిలు జరిపారు. ఇద్దరు ఏ క్షణంలో అయినా కాంగ్రెస్లో జాయిన్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ బీఆర్ఎస్ జీరో స్ట్రాటజీ పాలమూరు నుంచి ప్రారంభించారు.


అసెంబ్లీ ఎన్నికలలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 14 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ ఏకంగా 12 స్థానాలు గెలుచుకుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో కారు పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ గెలిస్తే ... పాలమూరు పార్లమెంటు స్థానంలో బిజెపి ఎంపీగా డీకే అరుణ విజయం సాధించారు. ఇది రేవంత్ రెడ్డికి ఒక విధంగా అవమానం లాంటిదే.. అందుకే సొంత జిల్లాలో బీఆర్ ఎస్ ను అసలు జీరో చేయాలని నిర్ణయించుకున్న రేవంత్ రెడ్డి క్యాడర్ వ్యతిరేకించినా కూడా గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్లో చేర్చుకున్నారు. ఇప్పుడు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు .. ఎమ్మెల్సీ చల్లాని కూడా కాంగ్రెస్లో చేర్చుకోబోతున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: