- జ‌గ‌న్ ఢిల్లీ ధ‌ర్నా కు డుమ్మా కొట్టిన తూమాటి.. వంక ర‌వీంద్ర‌
- పార్టీ మారే ఆలోచ‌న లో ఇద్ద‌రు ఎమ్మెల్సీలు

( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

ఏపీలో ప్రతిపక్ష వైసిపికి వరుస పెట్టి షాకులు మీద షాకులు తగులుతున్నాయి. పార్టీ ఘోర ఓటమి తర్వాత పలువురు కీలక నేతలు పార్టీ వీడి బయటకు వచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పలు జిల్లాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు ... కీలక నేతలు వైసిపిని బయటకు వచ్చేసారు. వీరిలో చాలామంది తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు. మరికొందరు జనసేన వైపు చూస్తున్నారు. తాజాగా రెండు రోజుల క్రితం గుంటూరు నగర వైసిపి అధ్యక్షుడుగా ఉన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు వైసీపీ ప్రాథమిక సభ్యత్వం తో పాటు నగర పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.


ఆయన గతంలో టిడిపిలో ఉండేవారు. ఈ క్రమంలోనే ఇప్పుడు గిరి టిడిపి వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ టిడిపిలోకి కుద‌ర‌ని పక్షంలో జనసేనలోకి అయినా వెళ్లాలని చూస్తున్నారు. ఇదిలా ఉంటే మరో ఇద్దరు ఎమ్మెల్సీలు సైతం ఇప్పుడు టిడిపిలోకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు ఎవరో కాదు ... ప్రకాశం జిల్లా కందుకూరు కు చెందిన ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ... పశ్చిమగోదావరి జిల్లా తణుకు చెందిన ఎమ్మెల్సీ వంక రవీందర్ నాథ్. వీరిద్దరూ ఈరోజు జగన్ ఢిల్లీ ధర్నాకు హాజరుకావాలని ఆదేశాలు వచ్చినా.. ఆ ఆదేశాలను దిక్కరించి మరి మండలి సమావేశాలకు హాజరయ్యారు.


దీనికి తోడు కూటమి ప్రజాప్రతినిధుల సైతం ఏంటి మీరు ఢిల్లీకి వెళ్లలేదా అని ఆశ్చర్యపోయారు. వైసీపీలో ఫ్యూచర్ లేదన్న నిర్ణయానికి వచ్చిన ఈ ఇద్దరు ఎమ్మెల్సీలు టిడిపి లో చేరే ప్రయత్నంలో ఉన్నారని ... అందుకే జగన్ తో టచ్ మీ నాట్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నట్టు ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆయన గతంలో టిడిపిలో ఉండేవారు. ఈ క్రమంలోనే ఇప్పుడు గిరి టిడిపి వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ టిడిపిలోకి కుద‌ర‌ని పక్షంలో జనసేనలోకి అయినా వెళ్లాలని చూస్తున్నారు. ఇదిలా ఉంటే మరో ఇద్దరు ఎమ్మెల్సీలు సైతం ఇప్పుడు టిడిపిలోకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: