కేంద్రంలో మూడోసారి అధికారాన్ని దక్కించుకున్న ఎన్డీఏ ప్రభుత్వం ఇక ఇటీవల పార్లమెంట్ సమావేశంలో భాగంగా బడ్జెట్ను ప్రవేశపెట్టింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ బడ్జెట్ లో ఏ రంగానికి ఎంత మొత్తంలో మినహాయింపులు ఉండబోతున్నాయి అనే విషయంపై ఇక ఎంతోమంది వ్యాపారస్తులు ఆశగా ఎదురుచూశారు. అదే సమయంలో ఇక సామాన్యులకు ఊరట కలిగించే అంశాలు ఏవైనా ఉంటాయేమో అని సామాన్య ప్రజలు కూడా ఎదురు చూశారు. అయితే ట్యాక్స్ చెల్లింపుల విషయంలో కేంద్ర బడ్జెట్లో మినహాయింపులు దక్కే అవకాశం ఉందని ఆశగా ఎదురు చూడగా ఉద్యోగులందరికీ కూడా నిరాశ ఎదురయింది.


 మరోవైపు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తీసుకుని ఒక నిర్ణయం పై మాత్రం ప్రస్తుతం ఉద్యోగులు అందరూ కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఉద్యోగులకు ట్యాక్స్ మినహాయింపు ఇచ్చే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.  ఈ విషయంపై ఉద్యోగులందరూ కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సగటు ఉద్యోగికి సంవత్సరానికి 7 లక్షల రూపాయల ఆదాయం దాటితే ఏకంగా 10% పన్ను చెల్లించాల్సిందే. ఇక ప్రతి ఉద్యోగి ఈ రూల్ ని తప్పకుండా పాటించాలి.



 ఇక ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అటు కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు. ఏకంగా ఏడాదికి 17,000 కోట్లు ఆర్జించే బీసీసీఐకి ఎలాంటి టాక్స్ ఉండదు. ఇది విడ్డూరంగా ఉంది అంటూ విమర్శలు చేస్తున్నారు. 17,000 కోట్లు సంపాదించే బీసీసీఐకి టాక్స్ ఉండదు. కానీ 7 లక్షల రూపాయల ఆదాయం కలిగిన సగటు ఉద్యోగికి మాత్రం 10% టాక్స్ ఉంటుంది. ఇదెక్కడి న్యాయం అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు నేటిజెన్లు. బిసిసిఐ చారిటబుల్ ఆర్గనైజేషన్ గా రిజిస్ట్రేషన్ అయింది. అయితే ఇన్కమ్ టాక్స్ యాక్ట్ లోని 12ఏ ప్రకారం బిసిసిఐ టాక్స్ వర్తించదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: