ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  దేశవ్యాప్తంగా మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న హత్యాకాండ, వైసీపీ నేత రషీద్ హత్య ఘటనను దేశవ్యాప్తంగా  తెలిసేలా జగన్ మోహన్ రెడ్డి.. ఢిల్లీలో ధర్నాకు దిగారు. జంతర్ మంతర్  వేదికగా ధర్నాకు పిలుపునిచ్చిన జగన్మోహన్ రెడ్డి... ఇవాళ ఉదయం నుంచి తమ పార్టీ ఎంపీలు అలాగే ఎమ్మెల్యేలతో... నిరసనకు దిగారు.

 
చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను దేశవ్యాప్తంగా తెలిసేలా..  నిరసన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే..  ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మహాధర్నా  కు ఎవరు మద్దతు ఇస్తారు అని అందరూ అనుకున్నారు.  కొంతమంది అయితే రాహుల్ గాంధీ కూడా  జగన్మోహన్ రెడ్డి ధర్నాకు వస్తారని ప్రచారం చేశారు. కానీ అందరికీ షాక్ ఇస్తూ సమాజ్వాది పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ జగన్ మోహన్ రెడ్డికి సంఘీభావం తెలపడం జరిగింది.


జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ధర్నాలో పాల్గొని... చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాదు ఏపీలో జరుగుతున్న... హత్యలు అలాగే దారుణాలపై అఖిలేష్ యాదవ్ మీడియాతో కూడా మాట్లాడారు.

 
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో.... ప్రభుత్వం దారుణంగా విఫలమైందని అఖిలేష్ యాదవ్ అన్నారు. ప్రజా స్వామ్యంలో బుల్లో జర్ సంస్కృతి అస్సలు మంచిది కాదని చురకలాంటించారు. విపక్షాలే లక్ష్యంగా దాడులు చేస్తామంటే అస్సలు కుదరదని... పరోక్షంగా చంద్రబాబు ప్రభుత్వానికి హెచ్చరికలు దారి చేశారు అఖిలేష్ యాదవ్. ప్రజాస్వామ్యంలో ఓటమి అలాగే గెలుపులు అనేవి చాలా సహజమని.. రేపు మళ్లీ జగన్మోహన్ రె డ్డి అధికారంలోకి రావచ్చని ఆయన వెల్లడించారు. దీంతో.. దేశవ్యాప్తంగా సరికొత్త చర్చ మొదలైంది. జగన్మోహన్ రెడ్డిని.. అఖిలేష్ యాదవ్  సమర్థించడం.. జాతీయ వ్యాప్తంగా   కొత్త చర్చకు దారి తీసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: