ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ,బీజేపీ ,జనసేన  కూటమి ఘన విజయం సాధించింది.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగోసారి భాద్యతలు స్వీకరించారు.తన మొదటి సంతకాన్ని డిఎస్సి నిర్వహణపై చేసారు.రాష్ట్రంలో ఖాళీగా వున్నా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీకి ఆమోదం తెలిపారు.ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మరియు ఐటి శాఖ మంత్రిగా నారా లోకేష్ భాద్యతలు తీసుకున్నారు.చంద్రబాబు మొదటి సంతకమైన డిఎస్సి నిర్వహణను పారదర్శకంగా జరిపేందుకు లోకేష్ చర్యలు చేపట్టారు.డిఎస్సి ప్రక్రియలో భాగంగా ఉపాధ్యాయ అర్హత పరీక్షఅయిన టెట్ ను నిర్వహించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.అభ్యర్థుల విన్నతి మేరకు టెట్ కోసం 90 రోజులు ,అలాగే టెట్ తరువాత డిఎస్సి నిర్వహణకు ఇంకో 90 రోజులు సమయాన్ని కేటాయించారు.దీనితో 6 నెలలో డిఎస్సి ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు ప్రకటించారు.

ఇదిలా ఉంటే టెట్ పరీక్ష కోసం జులై 3 నుంచి ధరఖాస్తులు స్వీకరణ ప్రారంభించగా ఆగస్టు 3 వ తేదీని చివరి గడువు తేదిగా  ప్రకటించింది.తాజాగా టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తాము రాయవలసిన పేపర్ ఎంపికలో తప్పులు సరిచేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది.ఈ మేరకు పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామరాజు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసారు.సవరణల కోసం పలు సూచనలు చేసారు.ఏపి టెట్ వెబ్ సైట్ లో లాగిన్ అయి అప్లికేషన్ డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ,అప్లికేషన్ చివర వుండే ఓటిపి ఆప్షన్ క్లిక్ చేయాలనీ అన్నారు.మొబైల్ కు వచ్చిన ఓటిపిని ఎంటర్ చేయగా అప్లికేషన్ డిలీట్ అవుతుందని తెలిపారు.తరువాత కనిపించే పేపర్ చేంజ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలనీ తెలిపారు.టెట్ పేపర్ల జాబితాలో అభ్యర్థి తాను మార్చుకోవాల్సిన పేపర్ సబ్జెక్టు ను గుర్తించి మార్చుకోవాలి అని తెలిపారు.ఆ తరువాత అన్ని వివరాలు తెలిపి సబ్మిట్ చేయగా అప్లికేషన్ ప్రక్రియ పూర్తి అవుతుందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: