తన ట్విట్టర్ లో ఇలా రాసుకొస్తు.. జిల్లాకి పది కోట్ల రూపాయల చొప్పున ఒక పార్టీ పంచిపెడుతోంది.. ఈ డబ్బులతోనే జిల్లాలో రాజకీయాల్లో అల్లర్లు సృష్టించాలని కూటమి ప్రభుత్వాన్ని సజావుగా పాలన చేయకుండా పలు రకాల కుట్రలు పడుతోంది అంటూ నాగబాబు తన ట్విట్టర్ నుంచి తెలియజేశారు. దాదాపుగా 1500 కోట్ల రూపాయలు ఇలా ఖర్చు చేశారని కూడా తెలియజేస్తున్నారు. ఇది తనకు పక్క సమాచారం ఉందని ఈ సొమ్ము అల్లరిలకు కాకుండా పేద ప్రజలకు పంపిణీ చేసి ఉంటే ఆ పార్టీ కాస్తయినా బాగుపడేది అంటూ సలహా ఇచ్చారు.
కానీ ఈ వాక్యాల పైన చాలామంది నేటిజన్స్ నాగబాబుని తిట్టిపోస్తున్నారు. నాగబాబు గారు మీరు అధికారంలో ఉన్నారు ఇలాంటి చిల్లర కామెంట్స్ ఎందుకు అంటూ పక్క సమాచారం ఉంటే సరిపోదు ఆ పార్టీ నేతల పైన కేసు పెట్టి మరి బొక్కలో వేయొచ్చు కదా కూటమిపాలన సజావుగా సాగేలా చేయొచ్చు కదా ఇలాంటి మంచి మంచి సలహాలు ఇవ్వచ్చు అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే కూటమి ప్రభుత్వం ఎందుకు సైలెంట్ గా ఉంది అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే మరి కొందరు మాత్రం అలాంటిదేమీ లేదని నోటిమాటగా జనసేన నేతలు కార్యకర్తలు తెలియజేస్తున్నారట. ఇవి కేవలం అనవసరపు వ్యాఖ్యలు అంటూ వెల్లడిస్తున్నారట. మరి ఇలాంటి వ్యాఖ్యల పైన నాగబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.