- పారిపోతున్న జగన్ పాతమిత్రులు.
- అధికారంలో ఎవరు ఉంటే ఆ పార్టీ గొడుగు కిందేనా.?
- పార్టీ నేతలంతా మాయం జగనన్నకు భయం భయం.!


వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో అద్భుతమైన మెజార్టీతో   గెలుపొంది అధికారంలోకి వచ్చారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో పథకాలు తీసుకువచ్చి వాటిని వాలంటీర్ల ద్వారా వారికి అందేలా చేశారు. ఏక్ నిరంజన్ జగన్ అనే విధంగా ఇవ్వడం తన చుట్టూ ఓ నలుగురు నాయకులు తప్ప మిగతా వాళ్ళు ఎవరిని కూడా ఆయన సరిగ్గా పట్టించుకునే వారు కాదని ఆరోపణలు వచ్చాయి. ఆ నలుగురు ప్రతిరోజు జగన్ ను జోకుతూ , జగన్ తోపు,  రాష్ట్రంలో  అద్భుతమైన పాలన నడుస్తోంది ప్రజలు మళ్లీ మరోసారి ఆశీర్వదిస్తారు అంటూ  పైకెత్తించారు తప్ప కింది స్థాయిలో ఏం జరుగుతుందో జగన్ కు తెలియకుండా చేశారు. చివరికి అధికారం కోల్పోయే వరకు వైసిపి పరిస్థితి కిందిస్థాయిలో ఎలా ఉందనేది అర్థం కాలేదు.  పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారకులు కిందిస్థాయి నాయకులే.  చాలామంది ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులు ఇసుక దందాలు, ప్రజలను ఇబ్బందులు పెట్టడం ఇలా అనేక విధాలుగా ప్రజల్లో మైనస్ అయిపోయారు.  


కానీ ఈ నాయకులే జగన్ వద్దకు వెళ్లి మేక వన్నెల పులీలా యాక్టింగ్ చేయడంతో వీరందరిని చూసి పూలే అనుకున్నారు. కానీ చివరికి వారు అంతా పిల్లులయ్యేదాకా అర్థం కాలేదు. అలా జగన్ వైసీపీని పూర్తిస్థాయిలో చతికిలపడేశారు. అయితే జగన్ పార్టీ పరిస్థితి ముందుగానే గమనించిన కొంతమంది సీనియర్ నాయకులు  పార్టీకి మెల్లిమెల్లిగా దూరం అవుతూ టీడీపీకి దగ్గరవుతూ వచ్చారు. ఈ నాయకులు జగన్ వద్దకు వెళ్లి పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గుతోందని ఎంత మొరపెట్టుకున్న వారి మాట అస్సలు లెక్క చేయలేదు. దీంతో వారికి నచ్చక పార్టీకి దూరమవుతూ వచ్చారు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది లావు కృష్ణదేవరాయలు,  పార్థసారథి, బాలశౌరి, గిరిధర్ రావు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కిలారు వెంకట రోశయ్య, వసంత కృష్ణ ప్రసాద్,  ఇలా కీలకమైన నేతలు అంతా ఇతర పార్టీలోకి జంపైపోయారు. వీరు పార్టీని వీడుతున్న జగన్ ఏమాత్రం పట్టించుకోలేదు.  అవినీతి అక్రమాలు చేసిన నాయకులను  పక్కన పెట్టుకొని, నిజాయితీ గల నాయకులను పక్కకు తోసేశారు. దీంతో ప్రజలకు విసుగొచ్చి  పార్టీని విసిరిగొట్టేశారు.

 వణుకుతున్న జగన్:
 ఇలా కీలక నేతలంతా వైసిపి పార్టీని వీడి  వెళ్తుండడంతో  జగన్ కు వణుకు పుడుతుందని తెలుస్తోంది. పార్టీలో ఉన్నప్పుడు ఎంతో ప్రాధాన్య ఇచ్చి వారు నిలదొక్కుకునేలా చేసిన జగన్ కు హ్యాండిచ్చి, వారి ఆస్తులను కాపాడుకోవడం కోసం ఇలా పార్టీల్లోకి మారుతున్నారు. కష్టకాలంలో ఉన్న పార్టీని ఆదరించాల్సిన వారే  వదిలేసి వెళుతుండడంతో,  రాబోవు రోజుల్లో వైసీపీ పార్టీ పూర్తిగా ఖాళీ అయ్యే అవకాశం ఉన్నట్టే కనిపిస్తోంది. ఈ వలసలు ఇలాగే కొనసాగితే మాత్రం  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో లేకుండా పోతుంది అనేది రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. మరి చూడాలి జగన్  వలస నాయకులను ఆపుతారా లేదంటే నాకెందుకులే అని కొత్త నాయకులను తయారు చేసుకుంటారా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: