- వైసిపి ఓటమిని ముందే గ్రహించాడా.?
- ముందే జగన్ ను టార్గెట్ చేశాడా.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికలు టిడిపి కూటమి,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. హోరా హోరిగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లు తలపడ్డారు. ఎవరికి వారే ఎన్నికల ముందు గెలుపు ధీమాను వ్యక్తం చేశారు. కానీ చివరికి టిడిపి కూటమి చేతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓటమిపాలైంది.  ఇదంతా గమనిస్తే మాత్రం చాలావరకు వైసిపి లో ఉన్నటువంటి చాలామంది సీనియర్ నాయకులు ఎమ్మెల్యేలు పార్టీలు మారారనే ఒక టాక్ వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి మొండిపోకడ అని సమాచారం.  ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత చుట్టూ భజనపరులు తప్ప అభివృద్ధి చేసి తాపత్రయపడే నాయకులందరిని దూరం చేసుకున్నాడు.


 కేవలం జగన్ కు భజన చేస్తూ ప్రతిపక్ష నాయకులను తిడుతూ ఉండే నాయకులకు మాత్రమే పెద్ద పీట వేశాడు.  అలా వన్ సైడ్ రాజకీయం చేసి చివరికి ప్రజల్లో ఆదరణ పొందినటువంటి వారిని దూరం చేసుకుంటూ వచ్చాడు.  అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. ఈయన జగన్ కు ఎన్నికల ముందే ఎన్నో విషయాలు తెలియపరిచే ప్రయత్నం చేశాడు.  జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒంటెద్దు పోకడలతో అతనిని  గంజిలో వెంట్రుకలా తీసేసాడు తప్ప ఏనాడు ఒక నాయకుడిగా గుర్తించలేదట.  దీంతో వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ విడిచి బయటకు వచ్చేసాడు. చంద్రబాబు సమక్షంలో టిడిపి పార్టీలో చేరి మళ్లీ మైలవరం నుంచి పోటీ చేసి అద్భుతమైన మెజారిటీతో గెలుపొందాడు. అలాంటి కృష్ణ ప్రసాద్ బయటకు వచ్చిన తర్వాత వైసిపి గురించి ఎలా మాట్లాడారు.. ఏం మాట్లాడారనే విషయాలు చూద్దాం.

 జగన్ తప్పిదం:
 జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన ప్రధాన తప్పిదం  చాలామంది పాత నాయకులను మార్చేసి ఆ నియోజకవర్గాల్లో కొత్త నాయకులను పెట్టకుండా ఇదివరకు ఎమ్మెల్యేలుగా చేసిన వేరే నియోజకవర్గం వారిని తీసుకువచ్చి పోటీ చేయించారు. ఆ విధంగానే వసంత కృష్ణ ప్రసాద్ పోటీ చేసే నియోజకవర్గంలో  మంత్రి జోగి రమేష్ పోటీ చేస్తారనే ఒక ప్రచారం ఎన్నికలకు ముందు జరిగింది..  ఎంతో అసంతృప్తికి లోనైనటువంటి వసంత కృష్ణ ప్రసాద్ జగన్ కు బహిరంగంగానే  కౌంటర్ ఇస్తూ వచ్చాడు. చివరికి పార్టీ నుంచి బయటకు వచ్చి జగన్ గురించి పూర్తిస్థాయిలో విమర్శలు చేశాడు. వసంత ఒక్కడు ధైర్యం చేసి బయటకు రావడంతో అదే లైన్ లో చాలామంది నాయకులు బయటకు రావాల్సి వచ్చింది. అయినా జగన్ ఎక్కడా తగ్గకుండా తానే గెలుస్తానని ఒక అపోహకు వెళ్లి  పార్టీలో మంచి బలమున్న నాయకులను దూరం చేసుకుంటూ వచ్చాడు. చివరికి అధికారానికి దూరమై ప్రతిపక్ష హోదా కూడా పొందలేకపోయాడు. ఇదే అద్భుత అవకాశం గా భావించిన టిడిపి కూటమి తిరుగులేని మెజారిటీ సాధించి పూర్తిగా ఈ ఐదు సంవత్సరాల్లో వైసీపీని లేకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో టీడీపీలో ఉన్నటువంటి కీలక నాయకులు అందరిని పార్టీలో చేర్చుకుంటూ వస్తోంది. మరి ఇది ఇలాగే కొనసాగుతూ వస్తే 2029 ఎలక్షన్స్ వరకు అసలు వైసీపీ ఉంటుందా పూర్తిగా చతికిల పడుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: