* జగన్ ఘోర ఓటమికి ముఖ్య కారణం అదేనా..?

* కీలక నేతలు పార్టీని వీడటంతో జగన్ కు మొదలైన కష్టాలు..

* అతి నమ్మకమే జగన్ ను నట్టేట ముంచిందా..?





ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎన్నికలలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి తిరుగులేని విజయం సాధించింది. గత ఎన్నికలలో 151 సీట్లు సాధించిన వైసీపీ కేవలం ఈ సారి 11సీట్లు సాధించి ప్రతిపక్ష హోదా కోల్పోయింది.కూటమి ఏకంగా 164 సీట్లు సాధించి సంచలనం సృష్టించింది. అయితే ఈ ఎన్నికలలో వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం వైసీపీ కీలక నేతలు పార్టీని వీడటమే.. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వైసీపీ అధినేత భారీ స్థాయిలో నియోజకవర్గ అభ్యర్థులను మార్చడంతో వైసీపీ లో అంతర కలహాలు మొదలయ్యాయి. దీనితో తన సొంత నియోజకవర్గం నుంచి బదిలీ అయ్యి వేరే నియోజకవర్గం వెళ్లిన అభ్యర్ధికి అక్కడ స్థానిక కార్యకర్తలు అంతగా సహకరించక పోవడంతో వైసీపీ లో అంతర యుద్ధం మొదలైంది. సొంత నియోజకవర్గంలోనే గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. ఇలాంటి గ్రూపు రాజకీయాలు చూసిన ప్రజలు విసుగు చెంది కూటమి నేతలను భారీ మెజారిటీతో గెలిపించారు.

ఇదిలా ఉంటే వైసీపీకి నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాలపై మంచి పట్టుంది. ఈ సారి నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాలు గెలవాలనే టార్గెట్ గా పెట్టుకున్న జగన్ కు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూపంలో పెద్ద షాక్ తగిలింది. వేమిరెడ్డి భార్య అయిన ప్రశాంతి రెడ్డి టికెట్ విషయంలో పార్టీలో మనస్పర్థలు మొదలయ్యాయి. జగన్ ని కలిసి పరిస్థితి వివరిద్దామని అనుకుంటే జగన్ అపాయింట్మెంట్ దొరకడమే కష్టమైంది. దీనితో పార్టీ కీలక విషయాలలో సలహాదారుల ప్రమేయం ఎక్కువవడంతో వేమిరెడ్డి పార్టీని వీడి టీడీపీ లో జాయిన్ అయ్యారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా టీడీపి తరుపున వేమిరెడ్డి పోటీ చేసారు. వేమిరెడ్డికి పోటీగా వైసీపీ కీలక నేత అయిన విజయ్ సాయి రెడ్డిని వైసీపీ బరిలోకి నిలిపింది.దీనితో రెండు పార్టీల మధ్య విమర్శ, ప్రతి విమర్శలు భారీగా జరిగాయి. చివరికి వేమిరెడ్డి అఖండ మెజారిటీతో గెలుపొందారు.ఆయన భార్య వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కూడా కోవూరు నియోజకవర్గంలో విజయం సాధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: