* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేసిన అనుభవం
* దాదాపు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక
* ఎన్నికల కంటే ముందే వైసిపి నుంచి టీడీపీలో చేరిక
* కూటమి ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. కీలక పరిణామాలు చోటు చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఎవరు ఊహించని విధంగా వైసీపీ పార్టీ ఓటమిపాలైంది. కేవలం 11 స్థానాలకి పరిమితమైంది వైసిపి పార్టీ. అటు కూటమి ప్రభుత్వం 164 స్థానాలతో అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే వైసీపీ పార్టీ ఓడిపోతుందని.. ముందే ఊహించి చాలామంది నేతలు.. ఎన్నికల కంటే ముందే జారుకున్నారు.
కాగా పెనమలూరు నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి జోగి రమేష్ ఘోరంగా ఓడిపోయారు. అయితే వైయస్సార్ అడుగుజాడల్లో నడిచిన పార్థసారధికి జగన్ మంత్రి పదవి ఇస్తానని.. మోసం చేశారు. అలాగే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కూడా ఇవ్వనన్నారు. దీంతో అలర్ట్ అయిన పార్థసారథి వెంటనే టిడిపిలోకి దూకేసి... తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకున్నారు.