ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు ప్రభుత్వ పనితీరుకు వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్నాకు దిగారు జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు అయిన 30 రోజుల్లో... శాంతి భద్రతల సమస్యలు వచ్చాయని... వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ధర్నాలో కూర్చున్నారు జగన్.

 

ఈ మేరకు వైసిపి పార్టీ ఎంపీలు,  ఎమ్మెల్యేలు, అలాగే ఎమ్మెల్సీలు కూడా ఢిల్లీకి పయనం అయ్యారు.ఇక... బుధవారం ఉదయం పదిగంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్నాకు దిగారు జగన్ రెడ్డి తో పాటు వైసిపి నేతలు. దీనికి సంబంధించిన విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి ధర్నాకు... చాలామంది జాతీయ నేతలు కూడా సపోర్ట్ ఇవ్వడం జరిగింది.


సమాజవాది పార్టీ అధ్యక్షులు, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, శివసేన పార్టీ నుంచి సంజయ్ రౌత్  ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి ధర్నాకు మద్దతు తెలిపారు. అలాగే చిన్న చిన్న పార్టీల నేతలు కూడా జగన్మోహన్ రెడ్డి ధర్నాకు వచ్చారు. అయితే గులాబీ పార్టీ మాత్రం.. జగన్మోహన్ రెడ్డి ధర్నాపై ఎలాంటి స్పందన  ఇవ్వలేదు. వాస్తవానికి లోక్సభలో గులాబీ పార్టీ ఎంపీలు లేకపోయినా.... రాజ్యసభలో మాత్రం ఉన్నారు.


ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో గులాబీ పార్టీ రాజ్యసభ సభ్యులు ఢిల్లీలోనే ఉన్నారు. ముఖ్యంగా కెసిఆర్ కు అత్యంత సన్నిహితుడైన సంతోష్ కుమార్ కూడా... ఢిల్లీలోనే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అలాంటిది.. జగన్మోహన్ రెడ్డి ధర్నాకు మాత్రం...  కెసిఆర్ పార్టీ  తరఫు నుంచి ఎవరూ వినలేదు. జగన్మోహన్ రెడ్డిని లైట్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరీ దీనిపై జగన్ మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: