- జ‌గ‌న్ మంత్రిని చేసినా నిలుపుకోవ‌ట్లేదా.. !
- పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉంటే పోరాడ‌లేరా.. !
- క‌న్న‌బాబు బాట‌లోనే తోట‌.. మ‌రి కొంద‌రు కాపు నేత‌లు.. !

( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )

ఒక ఓటమి వైసీపీ అధినేత జగన్ రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎన్నికల్లో ఘోరఓటమి తర్వాత ఈ 50 రోజులలో జగన్‌కు ప్రతిరోజు కూడా కంటిమీద కునుకు ఉండటం లేదు. ఏపీలో పరిణామాలు ఎప్పుడు ఎలా జరుగుతాయో..? అర్థం కాక ఆందోళనతో ఉన్న జగన్.. ఇప్పటికే రెండుసార్లు బెంగళూరు వెళ్లి అక్కడే దాదాపు 15 రోజులు గడిపి వచ్చారు. మధ్యలో కొద్ది రోజులు హైదరాబాద్‌లో ఉన్నారు. అసలు అమరావతిలో ఉండేందుకు జగన్ ఎంత మాత్రం ఇష్టపడటం లేదు. ఇక్కడ పరిణామాలు జగన్‌ను తీవ్ర కలవ‌రపాటుకు గురి చేస్తున్నాయి. ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులపై ఎటాకులు జరుగుతున్నాయి. పార్టీ శ్రేణులలో ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. ఇదిలా ఉంటే పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు వరుస‌పెట్టి కాడి కింద పడేస్తున్నారు.


ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వంలో తొలి మూడేళ్లపాటు మంత్రిగా ఉన్న మాజీ మంత్రి.. కాకినాడ జిల్లాకు చెందిన కురసాల కన్నబాబు కూడా ఇప్పుడు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు గోదావరి జిల్లా రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. కన్నబాబు జనసేనలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారట. కన్నబాబుకు జగన్ చాలా ప్రయారిటీ ఇచ్చారు. పార్టీలో చేరిన వెంటనే కీలకమైన కాకినాడ రూరల్ సీట్‌ను ఇచ్చారు. 2019 ఎన్నికలలో కాకినాడ రూరల్ నుంచి తక్కువ మెజార్టీతో గెలిచిన కన్నబాబుకు.. వెంటనే కీలకమైన వ్యవసాయ శాఖ మంత్రి పదవి కూడా ఇచ్చారు.


అనంతరం కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో ఆయనకు గ్యాప్ వచ్చింది. అక్కడ నుంచి జగన్.. కన్నబాబును పక్కన పెడుతూ వచ్చారు. చివరకు ఎన్నికల్లో కన్నబాబు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి జనసేన.. పంతం నానాజీ చేతిలో ఏకంగా 72,000 ఓట్ల తేడాతో చిత్తుచిత్తుగా ఓడిపోయారు. ఇక పార్టీ ప్రతిపక్షంలో ఉన్న నేపథ్యంలో పార్టీలో కాపు నేతలకు ప్రాధాన్యత లేదని.. కన్నబాబు పార్టీ మారెందుకు నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఆయన గతంలో ప్రజారాజ్యం ఎమ్మెల్యేగా గెలిచారు. పైగా మెగా ఫ్యామిలీతో ఎంతో అనుబంధం ఉంది. ఈ క్రమంలోనే ఆయన చూపులు జనసేన వైపు ఉన్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: