- కిలారు రోశ‌య్య ఆరోప‌ణ‌ల‌తో బ‌య‌ట‌కొచ్చిన నిజం
- పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఈ రెండు కులాల నేత‌ల‌కు కాంట్రాక్టులు నిల్‌
- పార్టీలో ఈ రెండు కులాల నేత‌లు ఆర్థికంగా ఎద‌గ‌కూడ‌ద‌న్న‌దే టార్గెట్

( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

ఒకటి మాత్రం నిజం ఐదేళ్ల వైసీపీ జగన్ పాలనలో పేరుకు మాత్రమే జగన్ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అని జపం చేసినా.. వారెవరికి నిజమైన రాజ్యాధికారం దక్కలేదు. జగన్ ప్రతి సభలోను ప్రతి సమావేశంలోనూ ముందుగా నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని ఓట్ల కోసం వారి జపం చేశారే తప్ప.. వారు ఆర్థికంగా ఎదిగేలా చేయలేదు. వారికి పదవులు ఇచ్చినా.. నిధులు ఇవ్వలేదు. వారికి సంపూర్ణ రాజ్యాధికారం ఇవ్వలేదు. తెరవెనక పెత్తనం అంత రెడ్డి సామాజిక వర్గానికి కట్టబెట్టారు. ఆంధ్రప్రదేశ్‌ను ప్రాంతాలవారీగా విభజించి కాంట్రాక్టులు, కీలక పనులు అన్న.. అన్ని రెడ్డి సామాజి వర్గానికి చెందిన కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు.


చాలా కాంట్రాక్టులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీ.. ఇక పోలవరం లాంటి పనులను నవయుగ ప్రాజెక్టు నుంచి తప్పించి వాటిని తన సొంత సామాజిక వర్గానికి చెందిన మెగా కృష్ణారెడ్డికి ఇచ్చారు. ఉత్తరంధ్ర‌తో మొదలుపెట్టి చిత్తూరు, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం చివరికి కృష్ణ, గుంటూరు జిల్లాలలో కాంట్రాక్టులు కూడా రెడ్డి సామాజిక వర్గంలో ప్రముఖ నేతలకే దక్కాయి. ఇవన్నీ ఇలా ఉంటే.. ఎన్నికలో పోటీ చేసిన అభ్యర్థులకు ఆర్థిక వనరుల పంపిణీలను కమ్మ, కాపు సామాజిక వర్గాలపై జగన్ వివక్ష చూపించినట్టు తాజా విషయం బయటకు వచ్చింది. నిన్న పార్టీ నుంచి బయటికి వచ్చిన వైసీపీకి చెందిన కాపు సామాజిక నేత పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు వెంకట రోశ‌య్య ఈ విషయాన్ని బయటపెట్టారు.


ఎన్నికల్లో పోటీ చేసిన మిగిలిన కులాలకు చెందిన అభ్యర్థులకు డబ్బులు ఇచ్చి.. కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలకు డబ్బులు ఇవ్వని మాట నిజం కాదా.. అని ఆయన జగన్‌ను సూటిగా ప్రశ్నించారు. అలాగే పార్టీలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలకు కూడా డబ్బులు సరిగా ఇవ్వలేదని.. ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలు నెల రోజుల నుంచి అసహనంతో ఉన్నారు. ఇప్పుడు కిలారు రోశ‌య్య‌ కూడా అదే విషయాన్ని ప్రస్తావించి జగన్‌ను విమర్శించడంతో.. ఈ విషయం మరోసారి బయటకు వచ్చినట్లయింది. అసలు పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచే పార్టీలో ఉన్న కమ్మ, కాపు నేతలు ఎవరు ఆర్థికంగా ఎదగకూడదు అన్న విధంగా జగన్ ప్రవర్తించినమాట నిజం.

మరింత సమాచారం తెలుసుకోండి: