తెలంగాణలో అధికారం కోల్పోవడంతో బి.ఆర్.ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ .. ఆయన తనయుడు కేటీఆర్ అసలు తట్టుకోలేకపోతున్నారు. ప్రతినిత్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకావడం లేదని విమర్శిస్తున్నారు. ఈ విమర్శల సంగతి ఏమోగానీ సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్కు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. రాష్ట్రం కోసం ఇప్పటికీ పోరాడటానికి రాష్ట్రం కోసం ఏదైనా సాధిస్తే అందులో ఆయన కూడా క్రెడిట్ పంచుకోవడానికి మంచి అవకాశం ఇచ్చారు. ఇది పెద్ద బంప‌ర్ ఆఫ‌ర్‌. సాధారణంగా ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఉద్ధరించే ప్రతి పని తమ చేతుల మీద గానే జరగాలని కోరుకుంటుంది.. కానీ రేవంత్ రెడ్డి మాత్రం చాలా సామరస్య ధోరణిలో కెసిఆర్ కు కూడా ఆ క్రెడిట్లో వాటా ఇవ్వాలంటూ ఒక సవాల్ విసిరారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని బిజెపితో పాటు అన్ని పార్టీలు భావిస్తున్నాయి.


ఈ క్రమంలో ఢిల్లీలో దీక్ష చేయడానికి తన సిద్ధంగా ఉన్నానని .. ప్రతిపక్ష నేత కేసిఆర్ కూడా కలిసి వస్తే కేంద్ర ప్రభుత్వంపై పోరాడుదాం కలిసి రాష్ట్రం కోసం సాధిద్దాం అంటూ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ ప్రస్తావన లేదని ... రాష్ట్రానికి అన్యాయం జరిగిందని రెండు రోజులగా పెద్ద ఎత్తున రాద్ధాంతం జరుగుతోంది. రాష్ట్రానికి నిధులు సాధించటం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో దీక్ష చేయాలని బీర్ ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ - హరీష్ రావు రేవంత్ ను డిమాండ్‌ చేశారు. దీనిపై స్పందించిన రేవంత్ తాను అందుకు సిద్ధమే అని అంటూనే ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వస్తే ప్రభుత్వాధినేతగా తాను కూడా వస్తానని రేవంత్ అన్నారు. ఏది ఏమైనా ఇది మంచి ఆఫర్ అని చెప్పాలి. మరి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఈ ఆఫర్ ను కేసీఆర్ ఎంతవరకు స్వీకరిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: