భర్త చంద్రబాబు జైలుకు వెళ్లడంతో అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చిన భువనేశ్వరి ఇప్పటికీ చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. భువనేశ్వరి రాజకీయ రంగ ప్రవేశం పై రకరకాల ప్రచారం కూడా జరుగుతుంది. తాజాగా భువనేశ్వరి భర్త చంద్రబాబు ప్రాతినిత్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ పర్యటన ఆసక్తిగా మారింది. వాస్తవానికి గత ఎన్నికల ప్రచారం ముందు నుంచే భువనేశ్వరి ప్రత్యేకంగా కుప్పం నియోజకవర్గంలో ఫోకస్ పెడుతూ వచ్చారు. ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చాక ఆమె కుప్పంలో పర్యటించి నియోజకవర్గ సమన్వయ కమిటీతో సమావేశం అయ్యారు.
రాజకీయాలు .. వ్యాపార రంగంలో టీమ్ వర్క్ అనేది చాలా ముఖ్యమని.. దీన్ని తాను బలంగా నమ్ముతానని భువనేశ్వరి తెలిపారు. ఈ టీం వర్క్ వల్లే రాష్ట్రంలో మళ్ళీ పార్టీ అధికారంలోకి వచ్చింది అన్నారు. మనం గెలిచామని... ఆ గెలుపు పలాలను ప్రజలకు అందించాలన్నదే సమన్వయ కమిటీ లక్ష్యం అని భువనేశ్వరి సూచించారు ఇక కుప్పం పర్యటనలో సామాన్యులంతా రోడ్లు .. లైట్లు .. కొళాయిలు ... రెవెన్యూ సమస్యలు తన దృష్టికి తీసుకువస్తున్నారని వాటిపై సమన్వయ కమిటీ ... పార్టీ అధినాయకత్వం దృష్టిపెట్టాలని భువనేశ్వరి సూచించారు.
తాను ప్రతి మూడు నెలలకు నియోజకవర్గానికి వస్తానని ఇక్కడ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఏది ఏమైనా నారా భువనేశ్వరి దూకుడు చూస్తుంటే భవిష్యత్తులో క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.