తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మూడవసారి ఎలక్షన్స్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.  సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత మొదటిసారి బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నారు. కాంగ్రెస్ పెట్టబోయే బడ్జెట్ పై సర్వత్ర ఆసక్తి నెలకొని ఉంది. ఈ బడ్జెట్ లో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కేటాయింపులు ఎక్కువ దేనికి జరుగుతున్నాయి అనే వివరాలు చూద్దాం.. 2.95 లక్షల కోట్ల రూపాయలతో 2.97 లక్షల కోట్ల రూపాయల వరకు పూర్తిస్థాయి బడ్జెట్ ను డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఈరోజు 12 గంటలకు ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను సమర్పించనున్నారు. 

ఉదయం 9 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకొని బడ్జెట్ కు ఆమోదం తెలపబోతోంది. ముఖ్యంగా ఆరు గ్యారెంటీ పథకాల అమలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, రుణమాఫీ, రైతు భరోసాకు కావలసిన అమౌంట్ సర్దుబాటు వంటి వాటిపై ప్రభుత్వం బడ్జెట్ సమావేశంలో పూర్తిగా స్పష్టత ఇవ్వనుంది. ముఖ్యంగా ఈ బడ్జెట్ లో వ్యవసాయానికి, విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. పంచాయతీలు, మున్సిపాలిటీలకు నిధుల కేటాయింపు కూడా ఎక్కువగా పోతోంది.

స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న వీరు పంచాయతీరాజ్ శాఖకు నిధులు ఎక్కువగా కేటాయించనున్నారు. రైతు భరోసాకు 14వేల కోట్ల రూపాయలు, రైతు బీమా, పంటల బీమాకు  పెద్ద ఎత్తున బడ్జెట్ పెట్టనున్నారు. అలాగే విద్య రంగానికి కూడా ఎక్కువ కేటాయింపులు ఉంటాయని సమాచారం అందుతుంది. ఇరిగేషన్ కు 25 వేల కోట్లకు పైగా కేటాయించనుంది. కేంద్రం అనుకున్న స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రంగాలకు అభివృద్ధి చెందేలా నిధుల కేటాయింపులు చేసే విధంగా అడుగులు వేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: