తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సంగటి తెలిసిందే. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క శాసనసభలో పూర్తిస్థాయి హద్దును ప్రవేశపెట్టారు. రూ. 2,91,159 కోట్లతో బడ్జెట్ ను సభ ముందుకు తీసుకు వస్తున్నట్లు మంత్రి తెలియజేశారు. దీంట్లో మూలధన వ్యయం రూ. 38,487 కోర్టుగా పేర్కొన్నారు. అంతకుముందు బడ్జెట్ కు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆగస్టు రెండవ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈనెల 26న అసెంబ్లీకి సెలవు, 27వ తేదీన బడ్జెట్ పద్దుపై చర్చ జరగనుంది.

ఇక ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఒక్కో శాఖకు ఎంత బడ్జెట్ ప్రవేశపెట్టామో ఆ వివరాలు ప్రకటించారు. ముఖ్యంగా ఇల్లు లేని వారికి శుభవార్త చెప్పారు  భట్టి విక్రమార్క. ఇందిరమ్మ పథకానికి ఎక్కువగా నిధులు కేటాయించారు భట్టి విక్రమార్క.  ఇందిరా మహిళా శక్తి పథకం కు 50.41 కోట్లు కేటాయించారు.


తెలంగాణ బడ్జెట్ పూర్తి వివరాలు..

తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్ 2,91,191కోట్లు.

తెలంగాణ ఏర్పాటు నాటికి 75577కోట్ల అప్పు..

ఈ ఏడాది డిసెంబర్ 6లక్షల 71 వేల కోట్ల కు చేరింది..

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 42 వేల కోట్ల బకాయిలు చెల్లింపు..

వివిధ రంగాలకు కేటాయింపు కోట్లలో..

వ్యవసాయం ,అనుబంధ రంగాలకు-72,659

హార్టికల్చర్-737

పశుసంవర్ధక శాఖ-19080

మహాలక్ష్మి ఉచిర రవాణా-723

గృహజ్యోతి-2418

ప్రజాపంపిణీ వ్యవస్థ-3836

పంచాయతీ రాజ్-29816

మహిళా శక్తి క్యాంటిన్ -50

హైదరాబాద్ అభివృద్ధి-10,000

జీహెఎంసీ-3000

హెచ్ ఎండీఏ-500

మెట్రో వాటర్-3385

హైడ్రా-200

ఏయిర్పోట్ కు మెట్రో-100

ఓఆర్ ఆర్ -200

హైదరాబాద్ మెట్రో-500

ఓల్డ్ సిటీ మెట్రో-500

మూసీ అభివృద్ధి-1500

రీజినల్ రింగ్ రోడ్డు-1500

స్ర్తీ ,శాశు -2736

ఎస్సీ ,ఎస్టీ సంక్షేమం-17000

మైనారిటీ సంక్షేమం-3000

బీసీ సంక్షేమం-9200

వైద్య ఆరోగ్యం-11468

విద్యుత్-16410

అడవులు ,పర్యావరణం-1064

ఐటి-774

నీటి పారుదల -22301

విద్య-21292

హోంశాఖ-9564

ఆర్ అండ్ బి-5790


ఇలా అన్ని రంగాలకు బడ్జెట్ ను కేటాయించారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క.  ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధి కోసం 10,000 కోట్లు ఇవ్వడం కూడా గమనార్హం. హైదరాబాద్ మెట్రో కు కూడా రూ. 500 కోట్లు పెట్టారు  ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క.

మరింత సమాచారం తెలుసుకోండి: