ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేసే విషయంలో కాస్త వెనకడుగు వేస్తున్నట్లు చర్చలు వినిపిస్తున్నాయి.. అసలు ఎన్నికల ముందు కీలకమైన పథకాలను సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం పింఛన్ పథకం పెంచడం తప్ప మిగిలిన వాటిని అసలు మర్చిపోయినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నది కూటమి.. దీంతో రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని చాలా సైలెంట్ గాని గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 15 రోజులలోని అన్ని పథకాలను కూడా అమలు చేయడం జరిగింది.


ఈ సమయంలో కొన్ని పథకాలు ఆయన నిర్దిష్ట గడువు విధించి కచ్చితంగా ఆ గడువు లోపల అమలు చేస్తామని కూడా తెలియజేశారు.. పథకాలకు సంబంధించి క్యాలెండర్ ని కూడా విడుదల చేశారు.. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాల గురించి ఎక్కడ కనిపించడం లేదు అసలు వినిపించడం లేదు.. ముఖ్యంగా తల్లికి వందనం పథకానికి ఏడాది పాటు సమయం పడుతుందంటూ ఇటీవలే అసెంబ్లీలో నారా లోకేష్ చెప్పుకు రావడం చాలా విమర్శలకు దారితీస్తోంది. అలాగే ఎలాంటి నిబంధనలు లేకుండానే ఈ పథకాన్ని అమలు చేస్తామంటూ కూటమి గతంలో ప్రకటించింది.



ఎందుకంటే ఎన్నికల ముందు నిబంధనలు ఉంటాయని  కానీ ప్రస్తుత సీఎం చంద్రబాబు ఎక్కడ కూడా ఈ విషయాలను తెలియజేయలేదు.. మరి పథకాలు అమలు చేయడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారనే విషయం ఇప్పుడు ప్రజలకు అంత చిక్కడం లేదు.. మరొకవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని పోలవరం పూర్తి చేస్తామని రోడ్లు వేస్తామని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన ఇప్పటివరకు ఇలాంటివి ఏమీ చేయలేదు ప్రస్తుతం ఖాళీ ఖజానా అయిపోయిందని రోజుకొక విధంగా నేతలు సైతం తెలియజేస్తూ ఉన్నారు. దీంతో ఇప్పుడు కూటమి నేతలకు సైతం ఈ పథకాలు అనేవి ఒక సవాలుగా మారిపోయింది. మరి ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: