ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవలే ఢిల్లీలో ధర్నా చేయడం చాలా విజయవంతంగా కూడా ముగిసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.దీంతో వైసిపి శ్రేణులు కూడా ఫుల్ ఖుషి గా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ధర్నాకు కూడా ఇతర పార్టీ నేతలు వస్తారో రారో అనే అనుమానం కూడా అందరికీ ఉండేది.. అయితే ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం సమాజ్వాది పార్టీ అధినేత అఖిల్ యాదవ్ ధర్నాకు వెళ్లడంతోపాటు మళ్లీ జగన్ సీఎం కావచ్చు అనే విధంగా కూడా కామెంట్స్ చేశారు. అధికారం కోల్పోవడంతో పాటుగా ఓటమిపాలు కావడంతో వైసిపి భవిష్యత్తు పైన చాలామంది పలు రకాలుగా కామెంట్స్ చేశారు.


అయితే ఈ విషయం నుంచి వెంటనే చేరుకున్న జగన్ తమ కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాల పైన హత్యలపైన ఢిల్లీలో ధర్నా చేశారు. ముఖ్యంగా టిడిపి కూటమి చేస్తున్న దాడుల్ని సైతం తిప్పికొట్టేందుకు జగన్తో సహా పలువురు పార్టీ నాయకులు కూడా రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని చేజేతులారా టిడిపి నే కల్పించిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా జగన్ వ్యూహాత్మకంగానే ఢిల్లీలో ధర్నా తలపెట్టారని వార్తల కూడా వినిపిస్తున్నాయి.



అయితే ఇంత మద్దతు సైతం టిడిపి పార్టీ కూడా అంచనా వేయలేక పోయింది. దేశ రాజధానిలో ధర్నా చేపట్టి ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలను సైతం విఘాతం కలుగుతోందన్న సందేశాన్ని కూడా జగన్ మరొకసారి ఢిల్లీ వరకు తీసుకువెళ్లారు.. అలాగే జగన్ ధర్నాకు సైతం ఎస్పీ, ఆఫ్, అన్న డీఎంకే, టిఎంసి, ఉద్ధవ్ శివసేన, అయ్యో ఏం ఎల్ తదితర పార్టీలు సైతం సపోర్టుగా తెలపడం జరిగింది దీంతో సరికొత్త రాజకీయ పరిణామం కూడా వైసిపి పార్టీకి చోటు చేసుకుంది అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. టిడిపి చేస్తున్న పనుల వల్ల జాతీయస్థాయిలో కూటమి కట్టిన బిజెపి పార్టీకి రాజకీయంగా నష్టం వాటిల్ల కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: