• తెలుగు రాష్ట్రాలంటే మోడీకి చిన్న చూపు! 
• మాటలతో మాయ చేస్తున్న మోడీ! 

విశాఖపట్నం - ఇండియా హెరాల్డ్: విశాఖ ఉక్కు…ఆంధ్రుల హక్కు అని నినాదాలు చేసి ఎందరో ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను..2021లో అమ్మకానికి పెట్టింది కేంద్రంలోని నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం. ఆ ప్లాంట్‌లో 100 శాతం వాటా విక్రయించడంతో పాటు రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ నుంచి వైదొలగాలని కూడా కేంద్రం నిర్ణయించుకుంది. స్టీల్‌ ప్లాంట్‌ మేనేజ్‌మెంట్‌ బాధ్యతలతో సహా పూర్తిగా ప్రైవేటీకరించాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర నిర్ణయంతో భగ్గుమన్న ఆంధ్రా కార్మిక సంఘాలు, వామపక్షాలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అప్పటి నుంచి నుంచి కూడా అలుపెరగకుండా ఎన్నో పోరాటాలు చేస్తూనే ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమైన రాజకీయ అంశంగా కూడా మారింది విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అంశం. అయితే స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను కార్మిక సంఘాలు, స్థానికులు వ్యతిరేకిస్తున్నా కూడా ముందడుగు వేసింది మోడీ ప్రభుత్వం.గత అయిదేళ్ల నుంచి విశాఖ ఉక్కు పరిశ్రమ పీకల్లోతు కష్టాల్లో ఎంతగానో కొట్టుమిట్టాడుతూ నలిగిపోతూ ఉంది. సొంత గనులు లేకపోవడంతో తరచూ ఉత్పత్తికి చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి.


ఉద్యోగులు, కార్మికులకు జీతాలివ్వలేని పరిస్థితి కూడా వచ్చింది. అయితే ఇటీవల ఏర్పడిన కేంద్రమంత్రివర్గంలో తెలంగాణకు చెందిన కిషన్‌రెడ్డికి బొగ్గు, గనుల శాఖ మంత్రిగా.. ఏపీకి చెందిన శ్రీనివాసవర్మకు ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రిగా ప్రధాని మోదీ అవకాశమివ్వడం జరిగింది. దీంతో స్టీల్‌ప్లాంట్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మళ్లీ ఆశలు మొదలయ్యాయి. అప్పుల భారంతో కుంగిపోతోన్న ఈ ఉక్కు పరిశ్రమకు బొగ్గు గనులు కేటాయిస్తే…కష్టాలు తొలగే అవకాశముందని ప్లాంటు ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.పైగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రైవేటికరణం జరిగేది లేదు అనడంతో ఆశగా ఉన్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకొని అధికారంలో ఉన్నా కూడా ఈ సమస్య తీరే నమ్మకం అయితే కలగట్లేదు. ఎందుకంటే మోడీకి ఆంధ్రా అన్నా తెలంగాణ అన్నా చిన్న చూపు. ఏదో పైకి తూతు మంత్రంగా మాటలు చెప్పి మోడీ మాయ చేస్తారే కానీ నిజంగా మోడీ స్టీల్ ప్లాంట్ సమస్యని తీర్చలేడని తీర్చే ఉద్దేశ్యం కూడా లేదని తెలుస్తుంది. మరి చూడాలి విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య మున్ముందు రోజుల్లో తీరుతుందో లేదో అనేది..

మరింత సమాచారం తెలుసుకోండి: