* మోడీ ప్రభుత్వానికి కీలకంగా మారిన ఏపీ, బీహార్ ఎంపీ సీట్లు

* మోడీ భయమంతా నితీష్ కుమార్ తోనే..ఆయనపై ఓ కన్నేసి ఉంచిన బీజేపీ నేతలు

* చంద్రబాబుపై వున్న ఆ నమ్మకమే మోడీ ప్రభుత్వం ఏపీ ని అలుసుగా తీసుకుంటుందా..?




2014 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విభజితం అయింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసింది. రాష్ట్రం రెండుగా విడిపోవటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. సంపదను ఇచ్చే హైదరాబాద్ రాజధాని తెలంగాణకు చెందటంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. దీనితో ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయాలనీ అప్పటి ప్రతి పక్షం అయిన బీజేపీ డిమాండ్ చేసింది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించగా 5 సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేసింది. దానికి కాంగ్రెస్ సైతం అంగీకరించింది.కానీ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో మాత్రం ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చలేదు.. అలాగే 2014 లో ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరిగాయి.. బీజేపీతో పొత్తు పెట్టుకుని పవన్ కళ్యాణ్ సపోర్ట్ తో ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే తెలంగాణకు కెసిఆర్ ముఖ్య మంత్రి అయ్యారు.కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ప్రధానిగా నరేంద్రమోడీ భాద్యతలు చేపట్టారు.


రాష్ట్రంలో అధికారంలో వున్న టీడీపీకి బీజేపీతో పొత్తు ఉండటం అలాగే కేంద్రంలో బీజేపీ అధికారం ఉండటంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని అంతా భావించారు. కానీ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని బీజేపీ తెలిపింది. విభజన చట్టంలో ఆ అంశం లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. అయితే ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని తెలిపింది. దీనితో హోదా కంటే ఎక్కువ నిధులు వస్తాయని తెలిపింది. దీనితో చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజ్ కు అంగీకరించారు. కానీ బీజేపీ ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చే నిధులలో జాప్యం చేయడంతో బీజేపీతో చంద్రబాబు తెగదెంపులు చేసుకున్నారు. దీనితో బీజేపీ, టీడీపీ ల మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అయింది. తమకి ప్రత్యేక హోదానే కావాలని చంద్రబాబు మళ్ళీ రివర్స్ అయ్యారు. అలా 2019 ఎన్నికలలో కాంగ్రెస్ తో పొత్తుకు అంగీకరించిన టీడీపీ ఆ ఎన్నికలలో ఘోరంగా ఓడింది. వైసీపీ పార్టీ ఏకంగా 151 స్థానాలు గెల్చుకుంది. అయితే అన్ని స్థానాలు వచ్చిన జగన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేలేకపోయారు.


రాజధాని సమస్య రాష్ట్రంలో తీవ్రతరం కావడంతో వైసీపీ తీరుపై రాష్ట్ర ప్రజలు నిరసన వ్యక్తం చేసారు. ఈ లోపు రాష్ట్రంలో రాజకీయం మారింది అప్పటివరకు విమర్శించుకున్న టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి 2024 ఎన్నికలలో పోటీ చేసి విజయం సాధించాయి. అయితే ఈ సారి కేంద్రంలో బీజేపీకి పూర్తి సీట్లు రాలేదు తన మిత్ర పక్షాలను కలుపుకొని మ్యాజిక్ ఫిగర్ తో మోడీ మూడో సారి పీఎం అయ్యారు. అయితే టీడీపీ, జేడియు మద్దతుతోనే మోడీ పీఎం అయ్యారు. దీనితో వారి మద్దతు మోడీకి చాలా అవసరం అయింది... ఇటు ప్రతి పక్ష ఇండియా కూటమి కూడా ఇప్పుడు బలంగా వుంది. దీనితో మోడీ బీహార్, ఆంధ్రప్రదేశ్ లకు ప్రత్యేక హోదా ఇవ్వకపోయిన ఇటీవల ప్రకటించిన బడ్జెట్ లో ఏపీకి 15000 కోట్లు, బీహార్ కు 26000 కోట్ల నిధులు ఇస్తున్నట్లు ప్రకటించింది. కానీ అది గ్రాంటా లేక అప్పా అనేది తేలాల్సి వుంది. అయితే మోడీ ప్రభుత్వంపై ఇతర రాష్ట్రాల వారు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు బడ్జెట్ ద్వారా లభించింది ఏమి లేదని ప్రశ్నిస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్ కు నిధులు కేటాయించిన కూడా మధ్యలో మెలిక ఉండటంతో టీడీపీ పై ప్రతిపక్ష పార్టీ వైసీపీ విమర్శలు చేస్తుంది. అయితే కేంద్ర అధికారానికి టీడీపీ కీలకం కావడంతో మోడీకి మరో ఆప్షన్ లేకుండా పోయింది..జేడియు నితీష్ కుమార్ కు పార్టీలు మార్చడం కొత్త ఏమి కాదు. దీనితో మోడీ భయమల్లా నితీష్ తోనే..అందుకే బీజేపీ నేతలు నితీష్ కుమార్ పై ఓ కన్నేసి ఉంచుతున్నారు. అయితే చంద్రబాబు ఎటు పోరని మోడీకి వున్న ఆ నమ్మకమే ఆంధ్రప్రదేశ్ ను అలుసుగా తీసుకునేలా చేస్తుందని రాష్ట్ర ప్రజలు విమర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: