- కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం
-అప్పుల రూపంలో కేటాయింపులు ఉంటాయా.?
-బీహార్ కు నిధుల వరద.!

 కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బిజెపి కూటమి ప్రభుత్వం  బడ్జెట్ ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ కేటాయింపులు చేసింది.  ఇదే తరుణంలో  దేశంలోని అన్ని రాష్ట్రాల్లోకెల్లా బీహార్ కు అత్యధిక కేటాయింపులు చేశారని ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించారని అంటున్నారు.  తెలంగాణకు జీరో బడ్జెట్ తో మోసం చేశారని ఆరోపణలు వస్తున్న తరుణంలో కూటమిలో కీలకపాత్ర పోషిస్తున్న చంద్రబాబు రాష్ట్రానికి కూడా కేంద్ర బడ్జెట్ అత్యధిక ప్రాధాన్యత దక్కలేదని ఏపీ ప్రజల విమర్శిస్తున్నారు.  బీహార్ తో పోల్చుకుంటే ఏపీకి మొండి చేయి చూపించారని అంటున్నారు. బీహార్ కు ఇచ్చిందేంటి ఆంధ్ర ప్రదేశ్ కు ఇవ్వాల్సింది ఏంటి అనే వివరాలు చూద్దాం.

 ప్రస్తుతం  ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి నిర్మల సీతారామన్ ఆసక్తికరమైన  వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ఎప్పుడు సపోర్టు ఉంటుందని అన్నారు.  తక్షణమే అమరావతి నిర్మాణానికి 15వేల కోట్ల రూపాయలను కేటాయింపులు చేశారు.  దీంతోపాటు ఈ ఆర్థిక సంవత్సరంలోనే వివిధ సంస్థల నుంచి నిధుల కేటాయింపు ఉంటుందని తెలియజేశారు. అంతేకాకుండా భవిష్యత్తు కాలంలో అమరావతికి మరిన్ని నిధుల కేటాయింపు జరుగుతుందని చెప్పుకొచ్చారు. అలాగే అతిపెద్ద ప్రాజెక్టు అయినటువంటి పోలవరంకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తుందని అన్నారు. విశాఖ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక కారిడారులకు  కేటాయిస్తామని చెప్పుకొచ్చారు. రాయలసీమ,  ప్రకాశం,  ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఉంటుందని, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి బడ్జెట్ లో  ఇచ్చినటువంటి మాట.

 ఎన్డీఏ  ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి మరో రాష్ట్రం బీహార్. ఇందులో జేడీయు నితీష్ కుమార్  కీలకంగా ఉన్నారు. దీంతో  కేంద్ర బడ్జెట్ లో బీహార్ కు మంచి ప్రాధాన్యత లభించింది. అభివృద్ధి, వరదల నియంత్రణకు 11,500 కోట్లు, కీలక హైవే ప్రాజెక్టులకు 26వేల కోట్లు, అంతేకాకుండా కోల్ కత్తా, అమృత్ సర్,  కారిడారులకు, ఇండస్ట్రియల్ నోడ్ తో పాటు భాగల్పూర్ హైవే, పాట్నా పూర్నియా ఎక్స్ ప్రెస్ హైవే కి నిధులు, బాక్సర్ దగ్గర గంగా నదిపై డబుల్ లైన్ బ్రిడ్జి అత్యధిక నిధులు ఇస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా బీహార్ కు మెడికల్ కాలేజీలు ఎయిర్ ఫోర్ట్ దీంతోపాటు  దేవాలయ అభివృద్ధికి ప్రత్యేకమైన నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఫిర్ ఫైన్ టిలో పవర్ ప్లాంట్ ఏర్పాటుకు 21,400కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయిస్తామని అన్నది. అలాగే ఇరిగేషన్ వరదల నియంత్రణకు 11,500 కోట్ల నిధులు కేటాయిస్తామని అన్నారు.

 ఈ విధంగా రెండు రాష్ట్రాల కేటాయింపులు చూస్తే మాత్రం  ఆంధ్రప్రదేశ్ కు కేవలం అమరావతికి సంబంధించి 15 వేల కోట్లు కేటాయింపు తప్ప మిగతా అభివృద్ధిలకు ఎంత అనేది చెప్పలేదు.  కానీ బీహార్ కు సంబంధించి చూస్తే 26 వేల కోట్లు, 11 వేల కోట్లు, 10వేల కోట్లు ఇలా దాదాపు కలిపితే మొత్తం 50వేల కోట్ల వరకు బీహార్ కు తక్షణ నిధులు కేటాయింపులు జరిగాయి. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ కు అప్పుల రూపంలో  కేటాయింపులు చేస్తామని వారు చెప్పకనే చెప్పేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: