2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో అధికారం చేతులు మారింది. అప్పుడు వరకు అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయితే.. అటు టిడిపి, బిజెపి, జనసేన పార్టీల కూటమి మాత్రం అఖండ విజయాన్ని సాధించింది. 164 స్థానాలలో విజయ డంకా మోగించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే అటు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.


 అయితే చంద్రబాబు ఏపీలో ముఖ్యమంత్రిగా ఉండడమే కాదు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కూడా కీలకపాత్ర వహిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అటు బిజెపికి సరైన మెజారిటీ రాకపోవడంతో అటు చంద్రబాబు మద్దతు కూడగట్టుకుని ప్రభుత్వము ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఎన్డీఏ ప్రభుత్వంలో అటు టిడిపి కీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో రాష్ట్రానికి భారీగానే నిధులు తీసుకురావడంలో చంద్రబాబు సక్సెస్ అవుతారని అందరూ అంచనా వేశారు. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాలలో అందరూ అనుకున్నట్లుగానే ఇక ఏపీకి భారీగానే నిధులు కేటాయించింది కేంద్రం. ఏపీ రాజధాని నిర్మాణానికి 15000 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో బీహార్ కి 26,000 కోట్లను కేటాయించింది.


 అంతేకాదు పోలవరం పూర్తి చేయడానికి పూర్తి సహకారం అందిస్తాము అంటూ తెలిపింది. కానీ ఇలా భారీగా నిధులు ఇస్తామని చెప్పింది. కానీ ఒక విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇలా ఏపీకి ఇవ్వబోయే నిధులు గ్రాంట్ లుగా ఇవ్వబోతున్నారా లేదంటే అప్పుగా ఇవ్వబోతున్నారా అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన అంశం. అదే సమయంలో బడ్జెట్ సమావేశం జరుగుతున్న సమయంలో.. అటు నిర్మల సీతారామన్ చట్టంలోని 94వ సెక్షన్ ప్రకారం ఏపీకి రాజధాని లేదని.. ఇక రాజధాని నిర్మాణం కోసం కేంద్రం పూర్తి సహకారం అందించాలని.. ఇది చట్టంలో ఉంది అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఇక ఇప్పుడు చంద్రబాబు మద్దతు ఇచ్చారు కాబట్టి చట్టం గురించి మాట్లాడుతున్నారు. కానీ గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఈ చట్టం నిర్మలమ్మకు గుర్తు రాలేదు. అమరావతిని ఎందుకు పట్టించుకోలేదు అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.



అయితే ఇలా విభజన హామీలను తెరమీదకి తెస్తూ అటు కేవలం కేంద్రం చంద్రబాబును సంతృప్తి పరుస్తూనే ఇక అప్పులుగా ఇస్తూ బాబును బిజెపి   మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తుందని.. నిర్మలమ్మ చెప్పినట్లు చట్టంలోని 94వ సెక్షన్లో అమరావతిని కేంద్రమే గ్రాంట్లు విడుదల చేసి పూర్తి చేయాలని ఉన్నప్పటికీ.. ఇక ఇప్పుడు పదిహేను వేల కోట్లు కూడా అప్పులుగా ఇచ్చేందుకే కేంద్రం సిద్ధమైందని ఎంతోమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చంద్రబాబు మద్దతు విరమించుకోకుండా ఉండేందుకు భారీగా నిధులు కేటాయిస్తున్నమని చెప్పినప్పటికీ ఇక అవి గ్రాంట్ లుగా కాకుండా అప్పులుగా ఇస్తూ ఏపీని మళ్లీ ముంచే ప్రయత్నం చేస్తుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: