సంచలనంగా మారిన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో వెంకట రమణ మిస్సింగ్ కేసు క్లియర్ అయింది. ఆయన మృతదేహం లభ్యమైంది. విజయవాడ ఏలూరు కాలువలో నరసాపురం ఎంపీడీవో మృతదేహాన్ని స్పెషల్ టీం, ఎస్డీఆర్ఎఫ్ టీంలు వెలికి తీశాయి. ఆరు రోజుల వెతుకులాట తర్వాత ఆయన మృతదేహం లభ్యమైంది. మధురానగర్ కు చెందిన గుర్రపు డెక్క తూడులో చిక్కుకొని మృతదేహం బయట పడింది. మృతదేహానికి గ్రీన్ పెన్ను ఉండటంతో అది ఎంపీడీవోదేనని పోలీసులు నిర్ధారించారు.  


ఈ నెల 15న అర్ధరాత్రి భార్యకు ఫోన్ మెసేజ్ పంపారు వెంకట రమణారావు. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పారు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులు ఏలూరు కాలువ వద్ద సిగ్నల్ కట్ అయినట్లు గుర్తించి… ఆ కాల్వలోకి దూకినట్లు పోలీసులు భావించారు.


అయితే నరసాపురం ఎంపీడీవో అదృశ్యం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆ తర్వాత సీంఎ చంద్రబాబు నాయుడు దీని గురించి అధికారుల వద్ద వాకబు చేశారు. మాధవాయిపాలెం ఫెర్రీ విషయంలో రూ.55 లక్షలకు సంబంధించి తీవ్ర ఒత్తిడికి ఆయన గురయ్యారు.  ఏపీ మాజీ చీఫ్ విప్ ప్రసాద రాజు  అండదండలతో కాంట్రాక్టర్ రెడ్డప్ప బెదిరింపులకు తాళలేకపోతున్నానని.. తనకు న్యాయం చేయాలని ఓ లేఖ రాశారు.


అయితే ఆయన ఫోన్ వాకబు చేసిన పోలీసులకు మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. అన్ నౌన్ నంబర్ల  నుంచి వెంకటరమణారావుకి ఫోన్లు వచ్చినట్లు వారు గుర్తించారు. రాజస్థాన్ కు చెందిన ఇద్దిరికీ, హైదరాబాద్ కు చెందిన ఒకరికి, మరికొన్ని గుర్తు తెలియని వ్యక్తుల ఖాతాలకు ఆన్ లైన్లో డబ్బులు బదిలీ చేసినట్లు వెలుగు చూసింది. అయితే మాధవాయి పాలెం ఫెర్రీ విషయమై రూ.55 లక్షలు బకాయి ఉండగా.. తీవ్ర ఒత్తిడికి గురై ఆయన ఆత్మహత్య చేసుకున్నారని కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ రావు తెలిపారు. మరోవైపు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి వారి అకౌంట్లలో డబ్బులు జమ చేశారని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: