ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. సోమవారం నుంచి ప్రారంభమైన సమావేశాలు..  షెడ్యూల్ ప్రకారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. అనంతరం.. ఆయనకు ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశ పెట్టి మంగళవారం అంతా చర్చించారు. ఇక ముందుగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం.. బుధవారం రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సి ఉంది. కానీ.. ప్రవేశ పెట్టలేదు.


వాస్తవానికి ఈ ఏడాది ఎన్నికలకు ముందు ఫిబ్రవరి మూడో వారంలో వైసీపీ ప్రభుత్వం ఓటాన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఇది మార్చి, ఏప్రిల్, మేఏ, జూన్, జులై వరకు పెట్టుకొని ఆమోదం పొందింది. ప్రస్తుతం ఈ బడ్జెట్ ప్రకారమే కేటాయింపులు జరుగుతున్నాయి. నిధుల వినియోగం కూడా ఉంది. కానీ దీనికి ఈ నెల ఆఖరుతో కాలం తీరుతుంది. వచ్చే ఆగష్టు నుంచి ప్రస్తుత ప్రభుత్వం బడ్జెట్  పెట్టి ఆమోదించుకొని కార్యకలాపాలు చేపట్టాల్సి ఉంటుంది.


గతంలో వైసీపీ ప్రభుత్వం కాబట్టి నవరత్నాలకు నిధులు కేటాయించింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో దేనికి ఎక్కువ నిధులు కేటాయిస్తారు. ఏ పథకం ఎప్పటి నుంచి అమలు అవుతుంది వంటి అంశాలు తెలిసేవి. కానీ చంద్రబాబు వ్యూహాత్మకంగా మరో రెండు నెలల పాటు ఓటాన్ అకౌంట్ బడ్జెన్ ను ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అసలు బాగాలేదు అని.. అందుకే బడ్జెట్ పెట్టాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అని సీఎం చెప్పారు.


అయితే గతంలో సీఎంగా పనిచేసిన జగన్ తన తొలి బడ్జెట్ నుంచే నవరత్నాలకు నిధులు కేటాయించారు. వాటిని అమలు చేశారు. ప్రస్తుత చంద్రబాబు సర్కారు బోలెడు హామీలు ప్రకటించింది. కానీ వాటిని అమలు చేయడం లేదు. ఇప్పుడు బడ్జెట్ లో సూపర్ సిక్స్ గ్యారంటీలతో పాటు పలు హామీలకు బడ్జెట్ కేటాయించాలి. ప్రస్తుతం పరిస్థితి అంత బాలేదు. ఒకవేళ వాటికి నిధులు కేటాయించకపోతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అందుకే చంద్రబాబు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వైపు మొగ్గు చూపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: