ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తుండగానే ఎన్నికల అయిపోయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నెల కాలం గడిచిపోయింది. 'ఇచ్చిన మాట, తప్పితె ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నోడే జగన్' అంటూ వచ్చిన జగన్ కు నిజంగానే ప్రజలు ఓటు వేయలేదు. 2019 ఎలక్షన్స్ లో 151 స్థానాలు సాధించి అద్భుతమైన మెజారిటీతో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీని 2024 ఎలక్షన్స్ లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. వైసీపీ మీద ఇంత విసుగు చెందడానికి ప్రధాన కారకులు ఎవరు అనేది ఇప్పటికి వైసిపి అధినాయకత్వానికి అర్థం కావడం లేదు. ఇది ఇలాగే జరుగుతున్న తరుణంలో వైసీపీలో ఉన్నటువంటి చాలామంది నాయకులు మున్సిపల్, చైర్మన్లు, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, టిడిపి వైపు చూస్తున్నారు. ఛాన్స్ ఇస్తే టిడిపిలోకి జంప్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నారు. 

ఇప్పటికే కొంతమంది చేరిపోయారు. మరి కొంతమంది చేయడానికి రెడీ అయిపోయారు. అలాంటి ఈ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వైసీపీకి మరో బిగ్ షాక్ ఇచ్చారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. 2019లో 151 సీట్లు సాధించి అద్భుతమైన మెజారిటీ సాధించినటువంటి వైసీపీ, పంచాయతీ ఎలక్షన్స్ లో  80%, మున్సిపాలిటీలో వందకి 100%, జిల్లా పరిషత్తులో 100%, మున్సిపాలిటీలు మండల పరిషత్తులో 80 శాతం విజయాన్ని సాధించాయి. అలా వైసీపీలో గెలిచిన చాలామంది నాయకులు ఇప్పుడు తెలుగుదేశం బాటపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ మూడు సంవత్సరాలు జగన్ ప్రభుత్వంలో ఎన్నో వర్కులు చేసినా కానీ బిల్స్ రాక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఆ బిల్స్ రాబట్టుకోవడానికి అవకాశం లేదు. మరోసారి పోటీ చేద్దామంటే ఆ పార్టీ లేదు.

 ఇప్పుడు  టిడిపిలో చేరితే బిల్స్ రాబట్టుకోవచ్చు, మరోసారి పోటీ చేయొచ్చని ఆలోచనతో టిడిపి వైపు చూస్తున్నారు. ఇప్పటిదాకా చిత్తూరు, వైజాగ్, పుంగనూరు,  కార్పొరేటర్లు మున్సిపల్ చైర్మన్లు చేరడం చూసాం. ఇప్పుడు ఎంపీటీసీలు, జడ్పిటిసిలు టిడిపిలోకి చేర్చే పని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రధానంగా తీసుకున్నారు. మిడుతూరు, పగిత్యాల  ఎంపీటీసీ సర్పంచులు అందరికీ నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి మరియు కౌన్సిలర్లకు టిడిపి కండువా కప్పి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. కానీ ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులు కాకపోయినా వాళ్ళ అమ్మాయిని చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీలో చేర్చి ఆమెను ఎంపీగా గెలిపించాడు. దీంతో టీడీపీకి సంబంధించిన వ్యవహారాలు మొత్తం ఆయనే  చూసుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: