( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

తెలుగు మీడియా ఛానళ్లకు సంబంధించి తాజాగా రేటింగ్‌లు విడుదలయ్యాయి.. ఓవరాల్ గా తెలుగు మీడియా న్యూస్ ఛానల్ లో టీవీ9 మళ్లీ మొదటి ప్లేస్లోకి వచ్చింది ఎన్నికల కౌంటింగ్ అనంతరం టీవీ9 తన స్టాండ్ పూర్తిగా మార్చుకుంది. అడ్డగోలు చర్చిలు అవి పెట్టకుండా కేవలం న్యూస్ ప్రసారానికి పరిమితం కావడంతో ప్రేక్షకులు టీవీ 9 చూస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇక రెండో స్థానంలో ఎన్టీవీ ఉంది. మూడో స్థానంలో టీవీ 5 వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో పాటు ఆ పార్టీ అభిమానులను టీవీ 5 బాగా ఆకట్టుకుంది. ఎన్నికలకు ముందు నుంచి టీవీ5 చేసిన చర్చలు విస్తృతమైన కవరేజ్ కి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కువగా ఎడిక్ట్‌ అయినట్టు తాజా రేటింగ్స్ చెప్తున్నాయి.


టీవీ 5 తర్వాత ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆ తర్వాత v6 చానల్స్ తమ స్థానాలను మెరుగుపరుచుకున్నాయి. ఇక వైసిపి ఘోరంగా ఓడిపోవడంతో ఆ ప్రభావం సాక్షి న్యూస్ ఛానల్ పై ఎక్కువగా పడింది. సాక్షి రేటింగ్ ఘోరంగా దిగజారి ఆ ఛానల్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. విచిత్రం ఏంటంటే వైసిపి వీరాభిమానులు కూడా సాక్షి ఛానల్ నమ్మట్లేదు.. కనీసం ఎన్నికల రిజల్ట్ రోజు కూడా సాక్షిలో న్యూస్ చూసేందుకు వాళ్ళు ఇష్టపడలేదు అంటే సాక్షి ఛానల్ పరిస్థితి ఎంత ఘోరంగా దిగజారిందో తెలుస్తోంది.


జగన్ అభిమానులు అందరూ సాక్షి 9 గా ముద్రపడిన టీవీ 9 వైపు చూడడంతో ఆ ఛానల్ కు బాగా ప్లస్ అయినట్టుగా కనిపిస్తోంది. ఇక అంచనాలు పెద్దగా ఉండని మహా టీవీ కూడా మెరుగైన ర్యాంకులు సాధిస్తోంది. విచిత్రం ఏంటంటే సాక్షి కన్నా ఇప్పుడు ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్ ఎక్కువ రేటింగ్స్ తెచ్చుకుంటుంది. సాక్షితో పోలిస్తే ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్ దాదాపుగా రెట్టింపు న్యూ వ్యూయర్ షిప్ తెచ్చుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: