ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు మంత్రుల కీలక కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. ఇంగ్లీష్ విద్యకు ఏపీలోని ఎన్డీయే ప్రభుత్వం వ్యతిరేకం కాదన్నారు. కానీ ఉపాధ్యాయులకు సరైన ట్రైనింగ్ లేకుండా ఇంగ్లీష్ విద్య అమలు సాధ్యం కాదు.. మూడో తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు టోఫెల్ శిక్షణ, పరీక్షలు వల్ల పిల్లలపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది అని తెలిపారు. టోఫెల్ శిక్షణలో అమెరికన్ యాక్సెంట్ వల్ల విద్యార్థులు కన్ఫ్యూజ్ అవుతున్నారు.. ఇంగ్లీషు భాష అవసరమే కానీ.. ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులు నాలాగా తెలుగు మాట్లాడటానికి ఇబ్బంది పడటం మంచిది కాదు అని నారా లోకేశ్ పేర్కొన్నారు.ఇదిలా ఉంటే.. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో తెలుగు భాష పై స్పందించారు.విద్యార్థులకు ఇంగ్లీషు మీడియం అవసరం కాదనడం లేదు. ఈ రోజు పోటీ పడాలి.. ఇతర దేశాలతో మన పిల్లలు పోటీ పడాల్సిన అవసరం ఉంది. ఇంగ్లీషు మీడియం చాలా అవసరం. అదేవిధంగా మళ్లీ విద్యార్థులు నాలాగా మాతృ భాష లో మాట్లాడటానికి ఇబ్బంది పడకూడదు. ఇప్పుడు కూడా నేను అప్పుడప్పుడూ తడబడుతున్నానని వెల్లడించారు మంత్రి నారా లోకేష్. మాతృ భాష మరిచిపోకూడదు. మాతృ భాషను కూడా కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. రెండు బ్యాలెన్స్ చేయాల్సిన అవసరముంది. ఇది సమగ్రంగా రివ్యూ చేస్తున్నాం. 100 రోజుల్లో యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాను. ఉపాధ్యాయులతో, సంఘాలతో మాట్లాడుతాను. మీ అందరితో కూడా మాట్లాడి.. చర్చించాక నిర్ణయం తీసుకుందామని చెప్పారు నారా లోకేష్.ఇదిలా ఉంటే.. గత ప్రభుత్వం నిర్వహించిన నాడు- నేడు పథకం వల్ల పెద్దగా ప్రయోజనం కనిపించలేదు అని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. నాడు నేడులో పాఠశాలలు అభివృద్ధి చెందితే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గింది.. గత ప్రభుత్వంలో 72 వేల మంది ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు సంఖ్య తగ్గింది.. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్స్ ఎందుకు రావడం లేదు సమీక్ష చేయాలని లోకేష్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: