- ఎట్ట‌కేల‌కు లెక్క తేల్చిన చంద్ర‌బాబు స‌ర్కార్‌
- ఏపీ మొత్తం అప్పు రు. 13 ల‌క్ష‌ల కోట్ల‌కు పై మాటే
- జాతీయ , అంత‌ర్జాతీయ సంస్థ‌ల రుణాలు కాకుండానే మార్చికి 3.75 ల‌క్ష‌ల కోట్ల రుణం

( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థిక ప‌రిస్థితి తేల్చ‌డానికి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కిందా మీదా ప‌డుతోంది. ఎట్ట‌కేల‌కు కిందా మీదా ప‌డుతూ అప్పు లెక్క తేల్చింది. చివ‌ర‌కు అప్పును ఎట్ట‌కేల‌కు రూ. 13 లక్షల కోట్లకుపైగానే ఉన్నట్లుగా గుర్తించారు. ఇందులో లక్షన్నర కోట్ల వ‌ర‌కు పెండింగ్ బిల్లులు ఉన్నాయ‌ని స‌మాచారం. ఇక జాతీయ‌.. అంత‌ర్జాతీయ సంస్థ‌ల రుణాలు కాకుండా 2019 మార్చి నాటికి 3.75 లక్షల కోట్ల వరకు రుణం ఉండగా, ఇప్పుడు ఆ రుణం 9.82 లక్షల కోట్లు దాటిపోయిందంటున్నారు. ఇక ఇందులో కేవ‌లం కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పులే 2.48 లక్షల కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది.


పలు ప్రభుత్వ పథకాల కోసం రిజర్వ్‌ బ్యాంకు తో పాటు జైకా, ఆసియన్‌ డెవలప్‌మెరట్‌ బ్యాంకు - హడ్కో - నబార్డ్‌ వంటి సంస్థల నుంచి తీసుకున్న రుణాలు మరో మూడు నుంచి నాలుగు లక్షల కోట్ల వరకూ ఉంటాయ‌ని అంచ‌నాలు వేస్తున్నారు. ఇక ఓవ‌రాల్ గా మొత్తం రుణం 13 నుంచి 14 లక్షల కోట్ల వరకు చేరుకుంటుందని ప్రకటించే అవకాశం ఉంది. ఈ రుణాల్లో అత్యధిక భాగం మాత్రం కాస్త ఆలస్యంగా చెల్లింపులు చేయవచ్చు. కేంద్ర ప్ర‌భుత్వం కొంత మొత్తం చెల్లిస్తుంది.


అప్పులు భారీగానే చేసినా వీటిని ఎక్క‌డెక్క‌డ ఖ‌ర్చు పెట్టారు .. ఎలా ఖ‌ర్చు పెట్టారు అన్న‌ది ప్ర‌భుత్వం ప్ర‌క‌టించ‌నుంది. గ‌త ఐదేళ్ల ప్ర‌భుత్వ పాల‌న‌లో అప్పుల కోసం … ప్రతి ప్రభుత్వ ఆస్తిని తాకట్టు పెట్టారు. ఆ తాకట్టు పెట్టిన ఆస్తుల వివరాలతో పాటు అప్పులు తెచ్చి ఆ డబ్బులు ఏం చేశారు అన్న‌దే బాబు బ‌య‌ట పెట్ట‌నున్నారు. ఓవ‌రాల్ గా జ‌గ‌న్ లెక్క‌కు మిక్కిలిగా చేసిన అప్పుల‌తో జ‌నాల‌ను అయితే ముంచేయ‌నున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: