ఇక విషయంలోకి వెళితే... టిడిపి ప్రభుత్వం తాజాగా విడుదల చేస్తున్న శ్వేత పత్రాల విషయంలో... లొసుగులు ఉన్నాయని వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆయన తాజాగా ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... బాబు పాలనని ఎండగట్టే ప్రయత్నం చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చే రావడమే ప్రతీకార రాజకీయాలు చేయడం మొదలుపెట్టారని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలోనే... టిడిపి గుండాలు వైసీపీ సానుభూతిపరుల పైన దాడులు, అత్యాచారాలు, ఆస్తులు ధ్వంసం చేయడం వంటివి చేస్తూ... సామాన్య జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రజలకు రాష్ట్రపతి పాలన కావాలని అడగడం జరిగిందని చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు గత పాలన గురించి కూడా చెప్పుకు రావడం జరిగింది. బాబు ఎప్పుడు కూడా ఎదుటివారిని వంచన చేస్తూ రాజకీయాలు చేయాలని చూస్తారని... అది ఆయన రక్తంలోనే ఉందని అన్నారు. ఎక్కడ లేని అప్పులను శ్వేత పత్రాలలో చూపిస్తూ... వాటిని నలుపు పత్రాలుగా మార్చేశారని తప్పు పట్టారు. ఇక ఎన్నికల ముందు ఆయన వాగ్దానం చేసిన హామీలను నెరవేర్చలేక... అప్పుల కుప్పలు ఉన్నాయంటూ ప్రజలను తప్పుతోవ పట్టించి... హామీల విషయంలో ఎస్కేప్ అవ్వాలని చూస్తున్నారు. రాష్ట్ర ప్రజలను ఎట్టి పరిస్థితుల్లోనూ బాబు నయవంచక మాటలను నమ్మవద్దని సూచనలు చేశారు.