* శ్వేత పత్రాల పేరుతో కాలం గడిపిన బాబు
* ఆగస్టు, సెప్టెంబర్ లో ఏపీకి గడ్డుకాలం
* కేంద్రం సహాయం తీసుకోవాల్సిందే
* కొత్తగా అప్పు తీసుకోవాల్సిందే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఇప్పుడు అత్యంత దారుణంగా తయారైంది. పూర్తిస్థాయిలో బడ్జెట్ పెట్టుకోలేని పరిస్థితి నెలకొన్నాయి. జగన్ దిగిపోయాక చంద్రబాబు ఏదో చేస్తారనుకుంటే ఆయన కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే పెట్టి చేతులు దులుపుకున్నారు. నాలుగు రోజులుగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. శుక్రవారం రోజు అసెంబ్లీ సమావేశాలు ముగించేసి... నేరుగా ఢిల్లీకి వెళ్లిపోయారు చంద్రబాబు నాయుడు.
ఆగస్టు అలాగే సెప్టెంబర్ నెలలో... బడ్జెట్ ఉండదు కనుక... కేంద్రాన్ని వెళ్లి అడిగే ఛాన్స్ ఉంటుంది. కొంతమేర సహాయం చేయాలని చంద్రబాబు కోరే అవకాశాలు ఉన్నాయి. అలాగే... ఆ రెండు నెలల పాటు అప్పులు కూడా చేసే అవకాశాలు ఉంటాయి. చంద్రబాబు ఆ దిశగా కూడా అడుగులు వేస్తారు. మళ్లీ బడ్జెట్ సమావేశాలు వచ్చే వరకు.. ఇలాగే పబ్బం గడిపే ఛాన్సులు ఉంటాయి. ఏది ఏమైనా నష్టపోయేది మాత్రం ఏపీ ప్రజలు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.