• బడ్జెట్ ప్రవేశ పెట్టకుండా ఏపీ ప్రజలకు చంద్రబాబు షాక్

• బడ్జెట్ పేరుతో సభ పెట్టి జగన్ నామస్మరణ చేశారు  

వైసీపీ వైఫల్యాలను తెలపడం తప్ప చేసింది ఏమీ లేదు  

( ఏపీ - ఇండియా హెరాల్డ్)

ఏపీలో జులై 22 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరంభమయ్యాయి. ఇవి నిన్నటితో ముగిసాయి. సీఎం చంద్రబాబు వీటిలో ఫుల్ బడ్జెట్ ఆవిష్కరించలేదు. ఈ సమావేశాలు ఏకపక్షంగా జరిగాయి. మాజీ సీఎం జగన్ ఈ సమావేశాలను పూర్తిగా బాయ్ కాట్‌ చేశారు. ఏపీ ప్రజలు మోసపోయారని, టీడీపీ కూటమి హామీలు నెరవేర్చడం లేదని, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఢిల్లీలో మాత్రమే మొర పెట్టుకుంటున్నారు. అసెంబ్లీలో వైసీపీ ఉనికి లేకుండా పోయింది. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు లేకపోవడంతో ఈ సమావేశాలు చప్పగా సాగాయి.

బడ్జెట్ పేరుతో జరిగిన సభలో టీడీపీ భజన, జగన్ నామస్మరణ తప్పితే మిగతా ఇంపార్టెంట్ విషయాలు ఏమీ మాట్లాడుకోలేదు. ఐదేళ్లలో ప్రజలకు ఏం చేస్తాం అనే దాని పై మాట్లాడకుండా అంతా జ‌గ‌న్ నామ‌స్మ‌ర‌ణే చేయడం ఏపీ ప్రజలకు కోపం తెప్పించింది. జగన్ తప్పే చేశారు అనుకుందాం, దాని గురించి ఒక రెండు మూడు నిమిషాలు మాట్లాడి ఆ తర్వాత తాము చేయాల్సిన, నెరవేర్చాల్సిన హామీల గురించి మాట్లాడి ఉంటే బాగుండేది. ఎంత సేపూ స‌భ‌లో ప్ర‌తి ఒక్క‌రూ జ‌గ‌న్ వైఫ‌ల్యాలు గురించే మాట్లాడితే ఎవరికీ ఉపయోగం? నాటి వైసీపీ పాల‌న గురించి కూడా మాట్లాడి టైమ్‌ వేస్ట్ చేశారు.

జగన్ కూడా ఏపీ ప్రజల కోసం సరిగా పోరాడడం లేదు. ఆయన అసెంబ్లీని బాయ్ కట్ చేయడం వల్ల వచ్చే లాభమేంటి? సింహం సింగిల్ గా వస్తుంది అంటూ చెప్పుకోవడం తప్ప అసెంబ్లీలో ఆ మాటకు ఎందుకు కట్టుబడి ఉండలేదు. తాను మంచే చేశానని బలంగా నమ్ముతున్నప్పుడు ఎందుకు భయపడాలి? చంద్రబాబు పోయినసారి ఎన్ని అవమానాలు చేసినా భరించి ఏపీ ప్రజల కోసం మాట్లాడలేదా, కానీ జగన్ ఎందుకు అసెంబ్లీని దూరం పెడుతున్నారు. అక్కడ ప్రజల గురించి టీడీపీ చేయాల్సిన పనుల గురించి బలంగా మాట్లాడితే బాగుంటుంది కానీ ఆయన కనీసం ఆ ప్రయత్నం కూడా చేయలేకపోయారు.

మరోవైపు టీడీపీ ఫుల్ బడ్జెట్ ప్రవేశ పెట్టకుండా, కేంద్ర నుంచి ఎలాంటి గ్రాంట్స్‌ తెచ్చుకోలేక అప్పుడే అసమర్ధ పాలనను చాటుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: