- గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్ట్ కు ఎన్టీఆర్ పేరు
- క‌ర్నూలు ఎయిర్ పోర్టుకు ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి పేరు
- తిరుప‌తి ఎయిర్ పోర్ట్‌కు శ్రీ వెంక‌టేశ్వ‌ర ఎయిర్ పోర్ట్‌
- దేశం మొత్తం మీద 22 ఎయిర్ పోర్టుల పేర్లు మార్పు

( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

ఆంధ్రప్రదేశ్లో మూడు ఎయిర్ పోర్టులకు పేర్లు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ క్రమంలోనే విజయవాడ సమీపంలో ఉన్న గన్నవరం ఎయిర్పోర్ట్ కు ఎన్టీఆర్ పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఇప్పటివరకు ఈ ఎయిర్ పోర్టును గన్నవరం ఎయిర్ పోర్ట్ గానే పిలుస్తూ వస్తున్నారు. ఇక గన్నవరం ఎయిర్ పోర్ట్ కు అంతర్జాతీయ హోదా వచ్చిన వెంటనే దీనికి ఎన్టీఆర్ ఎయిర్ పోర్టు అని పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలో పేర్కొంది.


ఈ మేరకు కేంద్ర విమానాయన శాఖ సహాయ మంత్రి పార్లమెంటుకు ఈ విషయాన్ని తెలిపారు. దేశం మొత్తం మీద 22 ఎయిర్పోర్టులను పేర్లు మార్చాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రతిపాదనలు వచ్చిన విషయాన్ని కూడా ఆయన పార్లమెంటుకు స్పష్టం చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్లో గన్నవరం కు ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ .. అలాగే కర్నూలు ఎయిర్పోర్ట్ కు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలని ఏపీ ప్రభుత్వం తెలిపింది.


ఇక తిరుపతి ఎయిర్పోర్ట్‌ను ఇప్పటివరకు రేణిగుంట ఎయిర్ పోర్టుగా పిలుస్తూ వస్తున్నారు. ఇకపై దీనిని శ్రీ వెంకటేశ్వర ఎయిర్ పోర్టుగా పేరు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపింది. ఇక ఉమ్మడి ప్రభుత్వంలో హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కు ఎన్టీఆర్ ఎయిర్ పోర్ట్ అన్న పేరు ఉండేది. అయితే వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆ పేరు మార్చి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు అని పెట్టారు. ఇప్పటికీ అదే పేరు అక్కడ కంటిన్యూ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: