తెలంగాణ శాసన మండలి రద్దు కాబోతుందా..? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తోంది. దీనిపై తాజాగా మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు వివాదస్పద వ్యాక్యలు చేశారు. రాజ్యాంగం ప్రకారం తెలంగాణలో శాసన మండలి చెల్లుబాటు కాదని బాంబ్‌ పేల్చారు మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు. కనీసం 120 మంది ఎమ్మెల్యేలు ఉంటే తప్ప శాసనమండలి ఏర్పాటు చేయడం కుదరదని తెలిపారు మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్నది 119 మంది ఎమ్మెల్యేలు మాత్రమేనని... దీనిపై నేను గవర్నర్ కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరికలు జారీ చేశారు.


కోర్టులో కూడా పిటిషన్ వేస్తామని తెలిపారు. త్వరలోనే తెలంగాణలో కౌన్సిల్ రద్దు అవుతుందని... కౌన్సిల్ రద్దు అవడం ఖాయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు. తెలంగాణలో జరుగుతున్న చేరికలు కాంగ్రెస్ కు అప్రతిష్ఠ తెస్తాయని... కోర్టుకు వెళ్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అనర్హత వేటు పడుతుందని తెలిపారు.


2/3 వంతు ఉంటే తప్ప విలీనం సాధ్యం కాదని వివరించారు మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు. కేటీఆర్ ఢిల్లీ ప్రెస్ మీట్ లో పచ్చి అబద్ధాలు మాట్లాడారని.. ఒక్క ఓటుతో వాజపేయి ప్రభుత్వం కూలిపోయిందని గుర్తు చేశారు. ఆయన ఎప్పుడూ ఎలాంటి ప్రయత్నం చేయలేదు... కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చినప్పుడు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళారని తెలిపారు.  మధ్యప్రదేశ్ లో జ్యోతిరాధిత్య సింధియా 16 మందిని చీల్చినప్పుడు కూడా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళారని.. మహారాష్ట్రలో శాసనసభాపక్షం విలీనమైందని గుర్తు చేశారు.


గతంలో చంద్రబాబు తెలుగుదేశం పార్టీని చీల్చినపుడు, చీలిక పార్టీకే గుర్తింపు వచ్చిందన్నారు. సురేష్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నప్పుడు అనర్హత వేటు పిటిషన్లను తన దగ్గర అలాగే పెట్టుకున్నాడు...చివరికి కోర్టు జోక్యంతో కొందరిపై అనర్హత వేటు వేశారని తెలిపారు. కేసీఆర్ సీఎం అయ్యాక విడతలవారీగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి చేరారు.... నాటి గవర్నర్ కి తప్పుడు సమాచారం ఇచ్చి కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారన్నారు మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు.


మరింత సమాచారం తెలుసుకోండి: