ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు హీట్ ఎక్కుతున్నాయి. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం రోజుతో ముగియడంతో.. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే.. ఏపీ అప్పుల వివరాలను కూడా ప్రకటించేశారు జగన్మోహన్ రెడ్డి. సూపర్ సిక్స్ గ్యారంటీలను.. ప్రజలు మర్చిపోవాలని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాడని జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు.


అసలు బడ్జెట్ పెడితే..  చంద్రబాబు అసలు రూపం బయటపడుతుందని చురకలాంటించారు.  తన పాలనలో 7 లక్షల కోట్ల వరకు మాత్రమే ఏపీ అప్పులు ఉన్నాయని.. కానీ ఎల్లో మీడియా మాత్రం 14 లక్షల కోట్లు అప్పు అయినట్లు... చూపించిందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ చేత కూడా ఇదే తప్పిదాలను చదివించాలని జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు.


అదే సమయంలో ఇండియా కూటమిలో చేరడంపై  జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇవ్వడం జరిగింది. వైసిపి పార్టీ ఢిల్లీలో ధర్నా చేస్తే అన్ని పార్టీలకు ఆహ్వానాలు పంపిందని.. కానీ కొన్ని పార్టీలు వచ్చాయని తెలిపారు.  కాంగ్రెస్కు ఆహ్వానం పంపిన కూడా వాళ్లే రాలేదన్నారు.  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే చంద్రబాబు మధ్య ఉన్న సంబంధం ఏంటో కాంగ్రెస్ బహిర్గతం చేయాలని సెటైర్లు పేల్చారు జగన్మోహన్ రెడ్డి. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అలాగే ఎన్డీఏ కూటమికి చెందిన ముఖ్యమంత్రి ఎలా కలుస్తారని మండిపడ్డారు.

 వాళ్ళ మధ్య ఉన్న సంబంధం ఏంటని నిలదీశారు. అలాంటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాల్సిన కర్మ తనకు లేదని జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. అయితే జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ తో కేసీఆర్ యాక్టివ్ అయినట్టు తెలుస్తోంది.  చంద్రబాబు అలాగే రేవంత్ రెడ్డి మధ్య రిలేషన్ ను జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారట. మళ్లీ తెలంగాణను ఆంధ్రలో కలిపేందుకు.. రేవంత్ రెడ్డితో చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని...  కొత్త నినాదాన్ని కేసీఆర్ ఎత్తుకోనున్నారని సమాచారం. జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను... వాడుకొని మరీ కేసీఆర్ రంగంలోకి దిగబోతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: