ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. వైసీపీ కేవలం 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితం అయింది. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత చాలామంది వైసీపీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. మరికొందరు రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తున్నారు.. దీంతో వైసీపీలో ఇన్చార్జిల కొరత పట్టి పీడించనుంది. ఉదాహరణకు ఉమ్మడి ఉభయగోదావరి .. తూర్పుగోదావరి జిల్లాలలో చాలా నియోజకవర్గాలలో వైసిపికి ఇన్చార్జిలు లేని దుస్థితి. గత ఎన్నికల్లో ఓడిపోయిన కారుమూరి నాగేశ్వరరావు - కొట్టు సత్యనారాయణ - చెరుకువాడ రంగనాథరాజు - ఆళ్ళ నాని - తలారి వెంకట్రావు - గుడాల గోపి లాంటి నేతలు ఇకపై వైసీపీ రాజకీయాల్లో కొనసాగుతారా ? అంటే సందేహంగానే కనిపిస్తోంది.


అలాగే నరసాపురం నుంచి పార్లమెంటుకు పోటీ చేసిన గూడూరి ఉమాబాల .. రాజమండ్రి నుంచి పార్లమెంటుకు పోటీ చేసిన గూడూరు శ్రీనివాస్ కూడా రాజకీయాల్లో కొనసాగే ఉద్దేశంలో లేరు. దీంతో వైసీపీలో ఈ పోస్టులన్నీ ఖాళీ అయిపోతున్నాయి. అలాగే రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కూడా ఈసారి అక్కడ పోటీ చేయరు. దీంతో అక్కడ కూడా ఇన్చార్జి పదవి ఖాళీ కానుంది. ఏలూరు పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయిన కారుమూరి సునీల్ కుమార్ .. కాకినాడ పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయిన చలమలశెట్టి సునీల్ మాకు ఎంపీ స్థానాలు వద్దే వద్దని చెబుతున్నారు.


ఇక అటు తూర్పుగోదావరి జిల్లాలోనూ చాలా చోట్ల వైసిపి నుంచి పోటీ చేసిన వారంతా ఇకపై క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగకుండా ఉండటమో ? లేదా వైసిపికి గుడ్ బై చెప్పి దూరంగా ఉండటం చేసే ప్లాన్ లో ఉన్నారు. ఏది ఏమైనా మరో ఏడాదిలో గోదావరి వైసీపీలో చాలా పోస్టులు ఖాళీ అయిపోనున్నాయి. మ‌రి జ‌గ‌న్ వీళ్ల భ‌ర్తీకి ఏదైనా వాంటెడ్ నోటిఫికేష‌న్ వేసుకుంటారేమో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: