( గుంటూరు - ఇండియా హెరాల్డ్ )

గణేష్ ను జగన్ బ‌లి పశువును చేయటం ఏంటి ? జగన్ ముంచేయటం ఏంటి ? టైటిల్ చూసి ఆశ్చర్యపోతున్నారా ఎస్ నిజమే .. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ రెడ్డి ఈ ఎన్నికలలో తన పార్టీ తరఫున పోటీ చేసేందుకు చాలామందికి సీట్లు ఇచ్చారు. వారిలో కొందరితో భారీగా ఖర్చు పెట్టించి వారిని నిలువునా ముంచేశారు. ఈ లిస్టులోకే వస్తారు బాపట్ల జిల్లాలోని రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన డాక్టర్ ఈపూరు గణేష్. ఈపూరు గణేష్ ఎవరో కాదు టిడిపిలో ఒక వెలుగు వెలిగి .. మాజీ మంత్రిగా పనిచేసిన ఈపూరు సీతారావమ్మ తనయుడు. ఈ కుటుంబానికి మంచి పేరు ఉంది. టిడిపిలో రాజకీయంగా ఒక వెలుగు వెలిగారు.


రద్దయిన కూచినపూడి నియోజకవర్గం నుంచి ఈపూరి సీతారావ‌మ్మ ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు మంత్రిగా కూడా పనిచేశారు. క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్న గణేష్ కుటుంబాన్ని జగన్ ఎన్నికలలో ఆశలు కల్పించి మరి తెర మీదకు తీసుకువచ్చారు. మోపిదేవికి సీటు ఇస్తే రేపల్లెలో చిత్తు చిత్తుగా ఓడిపోతారని జగన్ కు నివేదికలకు వెళ్లాయి. అందుకే ఎన్నికలకు ముందు డాక్టర్ గా ఉన్న గణేష్ ని తీసుకువచ్చి నీకు ఎమ్మెల్యే సీటు ఇస్తున్నా.. బంపర్ మెజార్టీతో గెలుస్తావు అని ఆశలు పెట్టి ఆర్థికంగా భారీగా ఖర్చు చేయించారు.


అయితే టిడిపి కూటమి ప్రభంజనంలో గణేష్ చిత్తుచిత్తుగా ఓడిపోయారు. పైగా ఇక్కడ గణేష్ గెలిస్తే తన ఆధిపత్యానికి ఎక్కడ గండిపడుతుందో అని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ వర్గం కూడా అస్సలు పనిచేయలేదు. ఏది ఏమైనా గణేష్ కు లేనిపోని ఆశలు కల్పించి రాజకీయాల్లో కితీసుకువచ్చి మరి జగన్ ముంచేసారని ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఓట‌మి త‌ర్వాత గ‌ణేష్ అస‌లు తాను రాజ‌కీయాల్లోకి ఎందుకు వ‌చ్చానా అని ఫీల‌వుతున్నార‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: