అంబానీ అదానీలు కంటే అతడు ధ‌న‌వంతుడు అంటే మీరు నమ్ముతారా? ఐశ్వ‌ర్యంలోనే కాదండోయ్... ఆద‌ర్శంలో కూడా అతను వారికంటే ధనికుడు అని చాలామందికి తెలియదు. అవును, ధాన‌ధ‌ర్మాల్లో అత‌డు అంద‌రి కంటే ధ‌నికుడు. త‌న‌ వ్యాపారం కంటే 6 రెట్లు ఎక్కువ డబ్బును ప్ర‌జ‌ల కోసం విరాళంగా ఇచ్చిన మహానుభావుడు ఆయన. అతను మరెవరో కాదు... ది గ్రేట్ అజీమ్ ప్రేమ్ జీ... విప్రో అధినేత‌. ఓ వైపు పొదుపు.. మ‌రోవైపు ధాన‌ధ‌ర్మాలు ప్రేమ్ జీలోని ప్రత్యేకత. ఆయ‌న నిశితమైన ఆలోచ‌న‌, పొదుపు స్వ‌భావం గురించి తెలిసిన వారు అందుకు భిన్న‌మైన ధాతృత్వ సేవ‌ల్ని చూసి అవాక్కవుతారు. విషయం ఏమిటంటే.. 2019లో అతడు తన విప్రో షేర్లలో 67 శాతం ఒక్కసారిగా విరాళంగా ఇవ్వడం ఇక నేడు ఆ షేర్ల విలువ రూ.1.45 లక్షల కోట్ల వద్ద ఉంది.

అయితే అతగాడి ధాతృత్వం అంత‌టితో ఆగ‌లేదు. అతడు తన సంపాదనలో భారీ మొత్తాల‌ను క్రమం తప్పకుండా విరాళంగా ఇస్తూ ఉంటాడు. విరాళం అనేది ఆయన జీవితంలో ఒక భాగం అయిపోయింది. అత‌డు ఒకప్పుడు భారతదేశంలో అత్యంత ధనవంతుడు. అంబానీ అదానీల కంటే ధ‌నికుడు అన్న విషయం కొంతమందికి తెలియదు. ఇక అజీమ్ ప్రేమ్‌జీ జీవితం ఇక్కడి దాకా రావడంలో అనేక ఆటుపోట్లు ఎదురయ్యాయని మీకు తెలుసా? 1940లలో ప్రేమ్‌జీ తండ్రి మహమ్మద్ హషీమ్ ప్రేమ్‌జీ `రైస్ కింగ్ ఆఫ్ బర్మా`గా పేరు గాంచారు. మహారాష్ట్రలోని జల్గావ్‌లో ఒక చిన్న వ్యాపారవేత్తతో ఒక అవకాశం ఒప్పందం వెస్ట్రన్ ఇండియా వెజిటబుల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (WVPL) స్థాపనకు దారితీసింది.

అక్కడినుండి వారి కష్టాలు మొదలయ్యాయి. 24 జూలై 1945న ముంబైలో జన్మించిన అజీమ్ ప్రేమ్‌జీ స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న స‌మ‌యంలోనే అతని తండ్రి మరణించడం జరిగింది. కేవలం 21 ఏళ్లకే ప్రేమ్‌జీ కుటుంబ వ్యాపార బాధ్యతలు చేపట్టడానికి మరలా భారతదేశానికి రావలసి వచ్చింది. కంపెనీ పేరు కాస్త గజిబిజిగా ఉందని భావించిన అజీమ్ దానిని `వెస్ట్రన్ ఇండియా ప్రొడక్ట్స్`లోని అంశాలను మిళితం చేసి విప్రోగా కుదించారు. అతడి నాయకత్వంలో విప్రో IT, హార్డ్‌వేర్, టాయిలెట్ ఉత్ప‌త్తులు స‌హా మరిన్నింటిలో విస్తరించింది ఆ కంపెనీ. నేడు ఇది రూ.2.65 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో భారతదేశపు మూడవ అతిపెద్ద IT సంస్థ. భారతదేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో 17వ స్థానంలో ఉన్నప్పటికీ విరాళాల విషయంలో ప్రేమ్‌జీ ఎప్పుడూ అందరికంటే ముందే ఉంటాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: