రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డికి షాక్‌ ఇచ్చారు. పార్లమెంట్లో నోటికి వచ్చినట్లు మాట్లాడటానికి వీలు లేదు అని విజయసాయి రెడ్డికి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా విజయసాయిరెడ్డి రాజ్యసభలో మాట్లాడుతూ ఏపీ హింసకు కేరాఫ్ అడ్రస్ అయిందని అన్నారు. ఇక్కడ హత్యలు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఎన్డీయే ఓటమికి కూడా ఈ నేరాల్లో భాగం ఉంది. ప్రైవేటు ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేశారు. వేలలో దాడులు, వందల్లో హత్యలు, రేప్‌లు, 31 రాజకీయ హత్యలు జరిగాయని అన్నారు.

 అయితే ఇలా విజయసాయిరెడ్డి చెప్పుకుంటూ వెళ్తుంటే డిప్యూటీ చైర్‌పర్సన్‌ హరివంశ్ అబ్జెక్షన్ చెప్పారు. ఇలా నెంబర్స్ చెప్పుకుంటూ వెళ్లడం కాదు, అవే నిజమని ప్రూవ్ చేసి చూపించండి అని సీరియస్ గా కౌంటర్ ఇచ్చారు. రెండేళ్ల క్రితం సభలో వేరే వాళ్లు ఇలాంటి ఆరోపణలు చేసినప్పుడు వైసీపీ వాళ్ళే అభ్యంతరం చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు.

తర్వాత పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబును విజయసాయిరెడ్డి ఏకిపారేశారు. "గతంలో పోలవరం ప్రాజెక్టును తమకే అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ సెంట్రల్ గవర్నమెంట్ ని అడిగింది. కేంద్రం ఆ కోరికను మన్నిస్తూ ఆ ప్రాజెక్టును రాష్ట్రానికి అప్పగించడం తెలిపింది. ఇక అదే అదునుగా భావించిన చంద్రబాబు ఆ ప్రాజెక్టు నుంచి కొంత సొమ్ము కాజేయాలని చూస్తున్నారు." అని విజయసాయిరెడ్డి షాకింగ్ అలివేషన్స్ చేశారు.

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ఈ ఆరోపణలు చేయడం మానుకోండి దీనికి ఏదైనా ఆధారాలు ఉంటే చూపించండి అప్పుడు చూద్దాం అని కటువుగా మాట్లాడారు. విజయసాయి ఆధారాల గురించి ఏం మాట్లాడలేదు ఆ ప్రశ్నలను దాటవేయడానికే ప్రయత్నించారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ఏపీలో జరుగుతున్న ఘటనలపై సాయంత్రంలోగా ఆధారాలు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. "మీరు చాలా సీనియర్ రాజ్యసభ సభ్యులు. మీరు మాట్లాడే ప్రతి మాట వాస్తవం అయి ఉండాలి. ఈరోజు మీరు చేసినవి చాలా సీరియస్ అలిగేషన్స్. వాటికి తప్పనిసరిగా ఆధారాలు చూపించండి లేకపోతే చేసిన కామెంట్స్ వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది." అని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: