తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తోంది. వారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలలో నాలుగు గ్యారంటీలు అమలైపోయాయి. ఇంకా రెండు గ్యారెంటీలు త్వరలో అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి ఈ తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో అన్ని వర్గాలకి న్యాయం జరిగేలా కేటాయింపులు జరిగాయి. ఇలా కాంగ్రెస్ పార్టీ పాలన జరుగుతున్న తరుణంలో ఓవైపు బీఆర్ఎస్,మరోవైపు బిజెపి పార్టీలు కాంగ్రెస్ పై తీవ్రంగా ధ్వజమెత్తుతున్నాయి. 

మహిళలకు ఇస్తానన్న 2500,వృద్ధులు వికలాంగులు వితంతువులకు 4000 పెన్షన్, ఇందిరమ్మ ఇండ్లు , యువతి యువతలకు స్కూటర్లు, ఉపాధి హామీ కూలీలకు 12 వేల రూపాయలు  ఇలా ఎన్నో హామీలు ఇచ్చారని వాటన్నింటినీ అమలు చేయడంలో  వెనుకబడిపోయారని అంటున్నారు. ఈ విధంగా  ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న తరుణంలో తాజాగా బిజెపి కేంద్ర మంత్రి బండి సంజయ్  కీలక వ్యాఖ్యలు చేశారు.  బీఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలు రెండు ఒకటే అని, ఈ పార్టీల నాయకులు అవకాశవాదులు అని అన్నారు. అవసరమైతే కాంగ్రెస్ పార్టీలో బిఆర్ఎస్ విలీనం చేయడం ఖాయమని తెలియజేశారు. నీతి ఆయోగ్ సమావేశాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకపోవడం చాలా దారుణమని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు గాడిద గుడ్డు లాంటివని సెటైర్లు వేశారు. 

ఇప్పటికే కేసీఆర్ విపరీతమైన అప్పులు చేసి తెలంగాణను అప్పుల పాలు చేశారని, కాంగ్రెస్ పార్టీ కూడా అదే ధోరణితో ముందుకు వెళ్తోందని, ఈ ప్రభుత్వ హయాంలో మర్చంట్ బ్యాంకర్స్ ద్వారా వేల కోట్ల అప్పు తెచ్చేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని  చెప్పుకొచ్చారు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తి అప్పుల కుప్పగా చేసే విధంగా నాయకులు ప్లాన్లు వేస్తున్నారని, ఇది ప్రజలను మోసం చేయడమే అంటూ విమర్శలు చేశారు బండి సంజయ్. మరి ఈయన వ్యాఖ్యలపై బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా కౌంటర్ ఇస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: