రాష్ట్రంలోని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం గ‌త వైసీపీ స‌ర్కారు హ‌యాంలో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌పై వ‌రుస‌గా విడుద‌ల  చేస్తున్న  శ్వేత‌ప‌త్రాల గురించి తెలిసిందే. ఈ క్ర‌మంలో వాటిపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ స్పందించారు. శుక్ర‌వారం తాడేప‌ల్లి నివాసంలో ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న శ్వేత ప‌త్రాల‌పై స్పందించారు. చంద్ర‌బాబు ప్ర‌వేశ పెట్టిన శ్వేత ప‌త్రాల్లో ప‌స‌లేద‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. అవ‌న్నీ అభూత క‌ల్ప‌న‌లేన‌ని చెప్పుకొచ్చారు.


ఈ క్ర‌మంలో శ్వేత‌ప‌త్రాల‌కు కౌంట‌ర్‌గా తాము ఫ్యాక్ట్ పేప‌ర్ పేరుతో వాస్త‌వాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించే ప్ర‌య త్నం చేస్తామ‌ని జ‌గ‌న్ అన్నారు. వైసీపీ హ‌యాంలో ఏం జ‌రిగిందో.. ఎన్ని అప్పులు చేశామో.. ప‌థ‌కాల‌ను ఎలా అమ‌లు చేశామో.. కూడా.. వివ‌రించామ‌ని.. వీటిలో అంకెలు, లెక్క‌లు, కేంద్రం ఇచ్చిన అప్పులు.. ఇచ్చిన గ్రాంట్లు.. ఆర్బీఐ గ‌ణాంకాల స‌హితంగా వివ‌రించామ‌ని జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ప్రతి స్టెప్‌లోనూ తాము తీసుకున్న నిర్ణ‌యాల‌ను వివ‌రించామ‌న్నారు.


శ్వేత‌ప‌త్రాల ద్వారా.. వైసీపీ ప్ర‌భుత్వంపై బుర‌ద జ‌ల్లే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని జ‌గ‌న్ ఆరోపించారు. అవ సర‌మైతే.. కేంద్రం లెక్క‌లు గ‌మ‌నించాల‌ని..అ దేస‌మ‌యంలో డీబీటీ ద్వారా ల‌బ్ధి పొందిన విష‌యాన్ని చూడాల‌ని ఆయ‌న ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. క‌రోనా స‌మ‌యంలోనూ.. ప్ర‌జ‌ల‌కు మేళ్లు జ‌రిగాయ‌ని.. తాము మేనిఫెస్టోలో పేర్కొన్న ప్ర‌తి విష‌యాన్ని తూచ‌. త‌ప్ప‌కుండా ప్ర‌తి ప‌థ‌కాన్ని డోర్ డెలివ‌రీ చేశామ‌ని జ‌గ‌న్ తెలిపారు. అయితే.. త‌మ‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేయాల‌న్న ఉద్దేశంతోనే చంద్ర‌బాబు వైట్ పేప‌ర్ పేరుతో కాలం వెళ్ల‌దీస్తున్నార‌ని అన్నారు.


దీనికి కౌంట‌ర్‌గా ఫ్యాక్ట్ పేప‌ర్ను విడుద‌ల చేస్తున్నామ‌ని చెప్పారు. అస‌లు ఏం జ‌రిగిందో ఈ ప‌త్రాల్లో వివ‌రిస్తామ‌ని చెప్పారు. త‌ద్వారా.. నిజాలు ప్ర‌జ‌ల‌కు తెలియాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తెలిపారు. ఎన్నిక‌ల హామీల‌ను అమ‌లు చేయ‌లేక‌.. ఇప్పుడు త‌మ‌పై బుద‌ర జ‌ల్లే కార్య‌క్ర‌మం చేస్తున్నార‌ని ఆయ‌న దుయ్య‌బ‌ట్టారు. దీనిని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని మీడియాను కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: