- తొలి రోజే రేవంత్ ను క‌డిగేస్తాన‌ని తోక ముడిచేసిన మాజీ సీఎం
- కేసీఆర్ సార్ కు ద‌మ్ముంటే బ‌య‌ట కాదు.. అసెంబ్లీ లో మాట్లాడాల‌ని కాంగ్రెస్ స‌వాళ్లు
- కేసీఆర్ అధికారం లో ఉంటేనే పులి.. ప్ర‌తిప‌క్షంలో ఉంటే పిల్లే నా ..?

( హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ ) .
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దెబ్బ‌కు మాజీ సీఎం కేసీఆర్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు అస‌లు తెలంగాణ అసెంబ్లీ లోనే అడుగు పెట్ట‌ని కేసీఆర్ తాజా స‌మావేశాల నేప‌థ్యంలో ఇక‌పై నా ఉగ్ర రూపం చూపిస్తా.. చీల్చి చెండాడుతానని అసెంబ్లీ వద్ద భీకర ప్రకటనలు చేయ‌డంతో అంద‌రూ నిజ‌మే అని న‌మ్మారు. ఈ ఒక్క డైలాగ్ ద్వారా ఇక కేసీఆర్ అసెంబ్లీకి హాజరు అవుతారని..రేవంత్ ప్ర‌భుత్వానికి నిజంగానే చుక్క‌లు చూపిస్తార‌ని అంద‌రూ భ్ర‌మ ప‌డ్డారు.


అయితే కేసీఆర్ అధికారంలో ఉంటేనే పులి.. ప్ర‌తిప‌క్షంలో ఉంటే పిల్లి అని ఫ్రూవ్ చేసుకున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు అసెంబ్లీకి హాజరై కేసీఆర్ చేసిన ప్రకటనతో సభలో సీఎం రేవంత్ వ‌ర్సెస్ కేసీఆర్ మధ్య టగ్ వార్ ఉంటుందని అంద‌రూ అనుకున్నారు. ఇక కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ కూడా క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంద‌న్న చ‌ర్చ‌లు కూడా స్టార్ట్ అయ్యాయి.


అయితే కేసీఆర్ తోక ముడిచేశారు. ఏకంగా సభకు డుమ్మా కొట్టేశారు. రాష్ట్ర బడ్జెట్ ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని పెదవి విరిచిన కేసీఆర్ సభలో స‌భ‌లో ఆయుధాల‌తో కాంగ్రెస్ పార్టీని ఉతికి ఆరేస్తారు అనుకుంటే.. ఆయ‌న ఏకంగా స‌భ‌కే గైర్హాజ‌ర‌య్యారు. చీల్చి చెండాడేస్తాన‌ని గొప్ప‌ల‌కు పోయిన కేసీఆర్ ఎటు వైపున‌కు వెళ్లార‌ని... కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.


కేసీఆర్ కు నిజంగా స‌త్తా ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సవాల్ చేస్తున్నారు. అసెంబ్లీలో రేవంత్ ను ఎదుర్కొనే విషయంలో కేసీఆర్ భ‌యంతో ఉండంతో నే స‌భ‌కు రావ‌డం లేద‌న్న చ‌ర్చ‌లు తెలంగాణ‌లో వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: