- వచ్చే 100 ఏళ్ల ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకుని హై స్పీడ్ హైవే నిర్మాణం
- ఆరు వ‌రుస‌ల్లో కొత్త ర‌హ‌దారి ప్లాన్‌

( హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ ) .

హైదరాబాద్ – విజయవాడ మార్గం తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల‌లో అత్యంత బిజీగా ఉండే మార్గం ఏద‌ని ప్ర‌శ్నించుకుంటే హైదరాబాద్ నుంచి  బెంగళూరు వెళ్లే ర‌హ‌దారి అని చెప్పాలి . ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకోవ‌డం నిజంగానే హ‌ర్ష‌ణీయం. ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల లో చూసుకుంటే హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ రూట్ అయితే చాలా బిజీగా ఉంటుంది. ప్ర‌తి రోజు ఈ రెండు న‌గ‌రాల మ‌ధ్య కొన్ని వేల వాహ‌నాలు ప్ర‌యాణిస్తూ ఉంటాయి. ఆ త‌ర్వాత హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరు వెళ్లే హైవేనే చాలా బిజీగా ఉంటుంది.


ప్ర‌స్తుతం హైదరాబాద్‌ – బెంగళూరు నగరాల మధ్య 44వ నెంబరు జాతీయ రహదారి ఉంది. అయితే ఇది నాలుగు వ‌రుస‌లుగా ఉంది. ముందుగా దీనినే ఆరు వ‌రుస‌లుగా విస్త‌రించాల‌ని అనుకున్నారు. అయితే ఇప్పుడు దానిని అలాగే ఉంచేసి మ‌రింత షార్ట్ క‌ర్ట్ లో ఆరు వ‌రుస‌ల పాటు హైస్పీడ్ జాతీయ రహదారిని నిర్మించనున్నారు. మాస్టర్‌ ప్లాన్‌ ఫర్‌ నేషనల్‌ హైవేస్‌ విజన్‌-2047 లో భాగంగా ఈ రహదారిని నిర్మించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం టార్గెట్ గా పెట్టుకుంది.


వాస్త‌వంగా వ‌చ్చే 100 ఏళ్ల ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకుని 12 వరుసలుగా ఈ నిర్మాణం చేపట్టాలన్న ప్రతిపాదన ఉన్నా.. ప్ర‌స్తుతానికి అయితే ఆరు వరుసలకే పరిమితం కావాలని భావిస్తున్నారు. డీపీఆర్‌ ఆమోదం పొందిన తర్వాత కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ కొత్త రహదారిని హైస్పీడ్, గ్రీన్‌ఫీల్డ్‌ హైవేగా నిర్మిస్తారు. దీనిపై గంటకు 120 కి.మీ. వేగంతో వాహనాలు రాకపోకలు సాగించేందుకు వీలుగా రహదారిని నిర్మిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: