ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైయస్ షర్మిల ప్రస్తుతం వ్యవహరిస్తున్నది. అలాగే తన అన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఒక షాకింగ్ ట్విట్ ని షేర్ చేసింది.. కూటమి ప్రభుత్వంలో ఏపీలో శాంతిభద్రతలు సైతం క్షీణించాయి అంటూ వైసీపీ కార్యకర్తల పైన జరుగుతున్న దాడులకు సైతం జగన్మోహన్ రెడ్డి గడిచిన కొద్దిరోజుల క్రితం ఢిల్లీలో ధర్నా చేశారు ఈ ధర్నాకు ఇండియా కూటమిలో పలు పార్టీ నేతలు కూడా సంఘీభావం తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలకపోవడంతో నిన్నటి రోజున విలేకరుల సమావేశంలో జగన్ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం పైన షర్మిల కౌంటర్ వేయడం జరిగింది.


ఢిల్లీలో వైసిపి చేపట్టినటువంటి ధర్నాకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదు సమాధానం తెలియాలి అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించాగా ..ఈ విషయం పైన షర్మిలను కూడా తప్పుపట్టారు.. తాజాగా షర్మిల కూడా ఈ విషయం పైన అసలు మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు.. పార్టీ ఉనికి కోసమే ఢిల్లీలో కప్పట నాటకం ఆడారుగా.. వ్యక్తిగత హత్య రాజకీయ రంగు పులిమినందుక.. లేకపోతే ఐదేళ్లపాటు బిజెపితో స్నేహబంధం పెట్టుకోవడం విభజన హక్కులను ప్రత్యేక హోదాను బిజెపికి తాకట్టు పెట్టినందుకా  అంటూ ఆమె ప్రశ్నించింది..


క్రిస్టియన్ అయి ఉండి క్రైస్తవులను ఊచకోత గురించి మాట్లాడకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బిజెపికి మద్దతు ఇచ్చింది మీరే కదా అంటూ షర్మిల సైతం జగన్ ని ప్రశ్నించింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి వ్యతిరేకించిన మతతత్వ బిజెపి పార్టీకి సైతం జై కొట్టింది మీరే కదా అంటూ ఫైర్ అయ్యింది.. మణిపూర్ ఘటన పైన కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తూ ఉంటే మీ నుంచి ఎలాంటి సంఘీభావం రాలేదు అంటూ షర్మిల ప్రశ్నించింది.. సిద్ధం అన్న వాళ్లకు 11 మంది బలం సరిపోలేదా ఇప్పుడు కలిసి పోరాడుదాం అంటున్నారు అంటు షర్మిల ఒక కౌంటర్ వేసింది. దీంతో మరొకసారి అటు అన్నా చెల్లెల మధ్య వైర్యం బయటపడిందని పలువురు నేతలు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: